Anantapur: చిత్రావతి నది మధ్యలో చిక్కుకున్న కారు

ABN , First Publish Date - 2021-11-19T14:21:36+05:30 IST

భారీ వర్షాల కారణంగా చిత్రావతి నదికి వరద ప్రవాహం ఎక్కువగా ఉంది.

Anantapur: చిత్రావతి నది మధ్యలో  చిక్కుకున్న కారు

అనంతపురం: భారీ వర్షాల కారణంగా చిత్రావతి నదికి వరద ప్రవాహం ఎక్కువగా ఉంది. ఈ క్రమంలో ఓ కారు నది దాటుతుండగా మధ్యలో చిక్కుకుంది. కారులో నలుగురు వ్యక్తులు ఉన్నారు. విషయం తెలిసిన వెంటనే పైర్ సిబ్బంది అక్కడకు చేరుకుని జేసీబీతో కారులో ఉన్నవారిని కాపాడేందుకు యత్నిస్తున్నారు. చెన్నై కొత్తపల్లి మండలం వెల్దుర్తి గ్రామ సమీపంలో నది దాటుతుండగా నీటి ఉధృతికి కారు కొట్టుకుపోయింది. కాగా నీటి ప్రవాహం అధికం కావడంతో జేసీబీ మధ్యలోనే ఆగిపోయింది. చిత్రావతి నది వద్దకు పోలీసులు, ఫైర్ సిబ్బంది చేరుకున్నారు. 

Updated Date - 2021-11-19T14:21:36+05:30 IST