AP News: చిన్నారి పట్ల చిన్నాన్న అసభ్య ప్రవర్తన

ABN , First Publish Date - 2022-07-28T15:22:36+05:30 IST

సమాజంలో రోజురోజుకూ మహిళలపై అత్యాచారాలు, లైంగిక దాడులు పెరిగిపోతున్నాయి.

AP News: చిన్నారి పట్ల చిన్నాన్న అసభ్య ప్రవర్తన

అనంతపురం: సమాజంలో రోజురోజుకూ మహిళలపై అత్యాచారాలు, లైంగిక దాడులు పెరిగిపోతున్నాయి. చిన్నారలని, రక్తసంబంధీకులని కూడా చూడకుండా కామాంధులు రెచ్చిపోతున్నారు. తాజాగా అనంతలో ఆరు సంవత్సరాల చిన్నారి పట్ల సొంత చిన్నాన్న అసభ్యంగా ప్రవర్తించారు. ఈ విషయాన్ని చిన్నారి సైగలతో తల్లిదండ్రుల దృష్టికి తీసుకెళ్లింది. తన సొంత మరిదే కూతురిపై అత్యాచారయత్నానికి ప్రయత్నించాడంటూ చిన్నారి తల్లి ఆవేదన వ్యక్తం చేసింది. చిన్నారిని వైద్యపరీక్షల నిమిత్తం ప్రభుత్వ అస్పత్రికి తరలించారు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు మూడో పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడు సాయిని అదుపులోకి తీసుకున్నారు. 

Updated Date - 2022-07-28T15:22:36+05:30 IST