పోలీసుల నిర్బంధంలో Anantapur జిల్లా కలెక్టరేట్

ABN , First Publish Date - 2022-06-13T16:22:54+05:30 IST

జిల్లా కలెక్టరేట్ పోలీసుల నిర్బంధంలోకి వెళ్లింది. కలెక్టర్ కార్యాలయం వాహనాలను ఎక్కడికక్కడే పోలీసులు దారి మళ్లించారు.

పోలీసుల నిర్బంధంలో Anantapur జిల్లా కలెక్టరేట్

అనంతపురం: జిల్లా కలెక్టరేట్ పోలీసుల నిర్బంధంలోకి వెళ్లింది. కలెక్టర్ కార్యాలయం వాహనాలను ఎక్కడికక్కడే పోలీసులు దారి మళ్లించారు. రైతు సమస్యలు పరిష్కరించాలని టీడీపీ చలో కలెక్టరేట్‌కు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో కలెక్టరేట్ వద్ద ఖద్దరు చొక్కా కనపడితే పోలీసులు నిర్బంధంలోకి తీసుకుంటున్నారు. టీడీపీ ముఖ్య నేతలను ఆదివారం రాత్రి నుంచి గృహనిర్బంధం చేస్తున్నారు. కలెక్టర్ కార్యాలయం ఎదుట భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కలెక్టరేట్‌కు వచ్చే అన్ని వైపులా బారికేడ్లను ఏర్పాటు చేశారు. కలెక్టర్ కార్యాలయంలోకి వెళ్తున్న వాహనాలను, వ్యక్తులను పోలీసులు నిశితంగా తనిఖీ చేసి లోపలికి పంపుతున్నారు. 

Updated Date - 2022-06-13T16:22:54+05:30 IST