Anantapur కలెక్టరేట్ వద్ద తీవ్ర ఉద్రిక్తత

ABN , First Publish Date - 2022-05-30T17:26:24+05:30 IST

జిల్లా కలెక్టరేట్ వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది.

Anantapur కలెక్టరేట్ వద్ద తీవ్ర ఉద్రిక్తత

అనంతపురం: జిల్లా కలెక్టరేట్ వద్ద తీవ్ర ఉద్రిక్తత  చోటు చేసుకుంది. పెంచిన పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు తగ్గించాలని డిమాండ్ చేస్తూ కలెక్టరేట్ ముట్టడికి  వామపక్ష పార్టీలు పిలుపునిచ్చాయి.  ముట్టడిలో భాగంగా కలెక్టరేట్‌కు మూడు వైపుల నుంచి వామపక్ష పార్టీల నేతలు తరలివచ్చారు. వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని వారిని అడ్డుకున్నారు. ఈ క్రమంలో వామపక్ష పార్టీల నేతలు, పోలీసులకు మధ్య తీవ్రస్థాయిలో తోపులాట జరిగింది. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాస్ రావు సహా వామపక్ష పార్టీల నేతలను పోలీసులు అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు. కలెక్టరేట్ వద్ద భారీగా పోలీసులు మోహరించారు. ఈ సందర్భంగా శ్రీనివాసరావు మాట్లాడుతూ.. రాష్ట్రంలో రౌడీలు, గుండాలను వదిలి పెట్టి ప్రజల కోసం పని చేస్తున్న వారిని అరెస్టు చేస్తున్నారని మండిపడ్డారు. పోలీసుల తీరు దారుణంగా ఉందన్నారు. పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించకపోతే ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ విధానాల పట్ల అప్రజాస్వామికంగా నిరంకుశంగా అరెస్టు చేస్తున్నారని శ్రీనివాసరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. 

Updated Date - 2022-05-30T17:26:24+05:30 IST