Advertisement
Advertisement
Abn logo
Advertisement

రాయదుర్గం లారీ ఓనర్స్ అసోసియేషన్ ఏర్పాటు వివాదాస్పదం

అనంతపురం:  డ రాయదుర్గం లారీ ఓనర్స్  అసోసియేషన్  కార్యాలయం ఏర్పాటుకు వ్యతిరేకంగా బెంగళూరు - బళ్ళారి జాతీయ రహదారిపై బళ్ళారి లారీ ట్రాన్స్ పోర్ట్ ఓనర్లు  ఆందోళనకు దిగారు. ఈ క్రమంలో ఆందోళనకారులను అడ్డుకునేందుకు వచ్చిన  డి హీరేహల్ ఎస్సై రామకృష్ణారెడ్డి, బళ్లారి లారీ యజమానుల మధ్య తీవ్రస్థాయిలో వాగ్వాదం చోటు చేసుకుంది. ఆంధ్ర ప్రాంతంలో ఆందోళన చేయవద్దంటూ బళ్లారి లారీ యజమానులను ఎస్సై రామకృష్ణారెడ్డి  హెచ్చరించారు. ఇది జాతీయ రహదారి అని ఆందోళన చేస్తామంటూ ఎస్సైతో బళ్లారి లారీ యజమానులు వాగ్వాదానికి దిగారు. రాయదుర్గం లారీ ఓనర్స్ అసోసియేషన్ కార్యాలయం ఏర్పాటు వెనుక ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి , కుమారుడు ప్రవీణ్ కుమార్ రెడ్డి ప్రమేయం ఉంది. నాలుగు రోజుల క్రితం రాయదుర్గం లారీ ట్రాన్స్ పోర్ట్  లోడింగ్ కార్యాలయాన్ని ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి, కుమారుడు ప్రవీణ్ కుమార్ రెడ్డి ప్రారంభించారు. సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్న ఆంధ్ర, కర్ణాటక లారీ యజమానుల ఘర్షణ ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 

Advertisement
Advertisement