Advertisement
Advertisement
Abn logo
Advertisement

Anantapurలో కలకలం రేపుతున్న వార్డు వాలంటీర్ ఆత్మహత్య లేఖ

అనంతపురం: జిల్లాలో వార్డు వాలంటీర్ ఆత్మహత్య లేఖ కలకలం రేపుతోంది. ‘‘నా చావుకు కారణం  ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన వాలంటీర్ ఉద్యోగం’’ అంటూ వార్డు వాలంటీర్ మహేష్ లేఖ రాసి ఆత్మహత్య చేసుకున్నాడు.  రాయదుర్గం పట్టణంలోని నాల్గవ సచివాలయం తొమ్మిదో వార్డులో మహేష్ వార్డు వాలంటీర్‌గా ఉన్నాడు. రెండు రోజుల క్రితం ఇంట్లోనే ఉరి వేసుకుని మహేస్ ఆత్మహత్య చేసుకున్నాడు. కాగా ప్రస్తుతం మహేష్ ఆత్మహత్య లేఖ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. వాలంటీర్లతో గొడ్డు చాకిరి చేయించుకుంటూ... మూడు పూటల వాలంటీర్లు అన్నం తినగలుగుతున్నారా అంటూ ఎవరూ ఆలోచించడం లేదని మహేష్ లేఖలోఆవేదన వ్యక్తం చేశాడు. తలాంటి పరిస్థితి మరొక వాలంటీర్‌కు రాకుండా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి  చూడాలంటూ మహేష్ వేడుకున్నాడు. 

Advertisement
Advertisement