Abn logo
Jun 11 2021 @ 09:29AM

కొత్తచెరువులో భూముల పంపకంపై అధికారుల సీరియస్

అనంతపురం: జిల్లాలోని కొత్తచెరువులో ప్రభుత్వ భూములు పంచడంపై ఉన్నతాధికారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ వ్యవహారంపై విచారణ జరపాల్సిందిగా ముగ్గురు తహసిల్దార్లలను నియమించారు. కొత్తచెరువు రెవెన్యూ పరిధిలో 26 ఎకరాల ప్రభుత్వ భూమిని ఇతరులకు అమ్మినట్లు నిర్ధారణ అయ్యింది. కోట్ల రూపాయలు విలువ చేసే 392-6 ఏ సర్వే నంబర్‌లోని భూమి వన్ బి నుంచి తొలగించారు. ఇతరుల పేరుతో మార్చిన మరి కొన్ని సర్వే నెంబర్లకు చెందిన ప్రభుత్వ భూములను అధికారులు బ్లాక్‌లిస్ట్‌లో పెట్టారు.