Jun 24 2021 @ 01:16AM

ఆనందయ్య మందు పంపిణీ

కరోనా బారిన పడకుండా కాపాడేందుకు తెలుగు చలన చిత్ర వాణిజ్య మండలి ఆధ్వర్యంలో (టీఎఫ్‌సీసీ)లో బుధవారం ఆనందయ్య మందును పంపిణీచేశారు. ఫిలిం చాంబర్‌ లో ఫోర్‌ సెక్టార్‌ ప్రొడ్యూసర్స్‌, సభ్యులు, సిబ్బంది, విలేకర్లకు ఈ మందును పంపిణీ చేశారు. ‘‘సినీ పరిశ్రమకు చెందినవారు, మీడియా మిత్రులు తమ ఐడి కార్డు చూపించి మందు  తీసుకెళ్లవచ్చు’ అని దామోదర్‌ ప్రసాద్‌ తెలిపారు. ‘‘ప్రస్తుతం700 మందికి ఆనందయ్య మందును అందిస్తున్నాం. ఎవరికైనా మందు కావాలంటే మాకు తెలియజేస్తే రెండు రోజుల్లో తెప్పించి ఇస్తాం’’ అని సునీల్‌ రెడ్డి చెప్పారు. ఈ కార్యక్రమంలో ప్రొడ్యూసర్‌ సెక్టార్‌ కౌన్సిల్‌ చైర్మన్‌ ఏలూరు సురేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.