Abn logo
Jun 23 2021 @ 12:46PM

అలా అమ్ముతున్నారంటే అది ప్రభుత్వ లోపమే: ఆనందయ్య

ప్రకాశం : కరోనా మందు తయారీకి సామగ్రి లేక తయారీలో వెనుకబడ్డామని ఆనందయ్య తెలిపారు. ప్రతి జిల్లాలో కరోనా మందు అందజేస్తున్నామన్నారు. పార్టీలతో సంబంధం లేకుండా అడిగిన వారందరికీ మందు అందిస్తున్నానని ఆనందయ్య వెల్లడించారు. బడ్డీ, బంకుల్లో తన మందు అమ్ముతున్నారంటే అది ప్రభుత్వ లోపంగా ఆయన అభివర్ణించారు. అటువంటి వారిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. మందు పంపిణీ కోసం ప్రభుత్వానికి లేఖ రాశానన్నారు. మందు పంపిణీకి ప్రభుత్వం సహకరించక పోవడం బాధాకరమని ఆనందయ్య పేర్కొన్నారు.