ఒమైక్రాన్ మందుపై ఆనందయ్య బయటపెట్టిన సంచలన విషయాలు

ABN , First Publish Date - 2021-12-20T21:41:41+05:30 IST

ఒమైక్రాన్ మందుపై ఆనందయ్య ఏబీఎన్‌తో సంచలన విషయాలు బయటపెట్టారు.

ఒమైక్రాన్ మందుపై ఆనందయ్య బయటపెట్టిన సంచలన విషయాలు

విజయనగరం జిల్లా: ఒమైక్రాన్ మందుపై ఆనందయ్య ఏబీఎన్‌తో సంచలన విషయాలు బయటపెట్టారు. ఈ వ్యాధి పట్ల ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. వ్యాధి సోకకుండా ముందస్తు వాడకం గురించి మందు తయారు చేశానన్నారు. ఈ సందర్భంగా ఆనందయ్య విజయనగరంలో ఏబీఎన్ ఆంధ్రజ్యోతితో మాట్లాడుతూ తాను తయారు చేసిన కరోనా మందు నిరంతరం పంపిణీ కార్యక్రమం జరుగుతోందన్నారు. ఈ కార్యక్రమం ఓ సేవగా భావించి చేస్తున్నానన్నారు. ఇప్పుడు కొత్తగా వచ్చిన ఒమైక్రాన్‌కు కూడా ముందస్తు మందు తయారు చేశానన్నారు. శీతాకాలంలో ఒమైక్రాన్ ప్రభావం ఉంటుందని అందరూ ముందు జాగ్రత్త చర్యగా ఈ మందును 15 రోజులకొకసారి తీసుకోవాలని.. అలా ఫిబ్రవరి నెలాఖరు వరకు వాడాలని సూచించారు. ఆ తర్వాత వేసవి కాలం వస్తుందని, అప్పుడు ఒమైక్రాన్ తీవ్రత అంతగా ఉండదని ఆనందయ్య అన్నారు.

Updated Date - 2021-12-20T21:41:41+05:30 IST