Guntur: నక్కా Anandababu హౌస్ అరెస్ట్

ABN , First Publish Date - 2022-06-03T17:47:17+05:30 IST

మాజీ మంత్రి నక్కా ఆనంద బాబును పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు.

Guntur: నక్కా Anandababu హౌస్ అరెస్ట్

Guntur: టీడీపీ నేత, మాజీ మంత్రి నక్కా ఆనంద బాబు (Anandababu)ను పోలీసులు హౌస్ అరెస్ట్ (House arrest) చేశారు. ఆయన సీఐడీ కార్యాలయం వద్దకు వెళ్లకుండా ముందస్తు చర్యలు తీసుకున్నారు. పోలీసుల తీరుపై ఆనంద బాబు ఆగ్రహం చేశారు.


గుంటూరు సీఐడీ కార్యాలయం వద్ద భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇవాళ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు సీఐడీ విచారణకు రానున్నారు. ఈ సందర్భంగా అక్కడ గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. అచ్చెన్నాయుడు పిఆర్వో వెంకటేష్ సోషల్ మీడియాలో పోస్టింగ్స్‌పై విచారణకు పిలిచారు. నిన్న అధికారులు విచారణ చేసి రాత్రికి ఇంటికి పంపించారు. సీఐడీ కార్యాలయానికి పెద్ద ఎత్తున టీడీపీ కార్యకర్తలు వచ్చే అవకాశం ఉండటంతో భారీగా పోలీసుల మోహరించారు.

Updated Date - 2022-06-03T17:47:17+05:30 IST