కరోనా కట్టడిలో వైసీపీ ప్రభుత్వం విఫలం

ABN , First Publish Date - 2021-05-09T05:47:31+05:30 IST

ప్రజల ప్రాణాలంటే సీఎం జగన్‌కు లెక్కలేకుండా పోయిందని.. ప్రజలకు కనీసం కరోనా టెస్టులు కూడా సరిగ్గా చేయలేని దుస్థితి రాష్ట్రంలో ఏర్పడిందని మాజీ మంత్రి, టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు నక్కా ఆనందబాబు విమర్శించారు

కరోనా కట్టడిలో వైసీపీ ప్రభుత్వం విఫలం
నిరసన చేపట్టిన మాజీ మంత్రి నక్కా ఆనందబాబు

నక్కా ఆనందబాబు


గుంటూరు, మే 8(ఆంధ్రజ్యోతి): ప్రజల ప్రాణాలంటే సీఎం జగన్‌కు లెక్కలేకుండా పోయిందని.. ప్రజలకు కనీసం కరోనా టెస్టులు కూడా సరిగ్గా చేయలేని దుస్థితి రాష్ట్రంలో ఏర్పడిందని మాజీ మంత్రి, టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు నక్కా ఆనందబాబు విమర్శించారు.  రాష్ట్రంలో ప్రజలందరికీ కరోనా వ్యాక్సిన్‌ ఇవ్వాలని డిమాండ్‌ చేస్తూ గుంటూరులోని తన కార్యాలయంలో శనివారం ఆయన నిరసన చేపట్టారు. అనంతరం మాట్లాడుతూ విశాఖ స్టీల్‌ప్లాంట్‌ నుంచి ఆక్సిజన్‌ తరలిపోతుంటే రాష్ట్రంలో పట్టించుకునే వారే కరువయ్యారన్నారు. కరోనాపై పోరులో రాష్ట్ర ప్రభుత్వం అలసత్వం  వల్లనే ఇంతటి విపత్కర పరిస్థితులు ఏర్పడ్డాయన్నారు. క్యాబినెట్‌ అజెండాలో కరోనాను 33వ అంశంగా పెట్టడాన్ని బట్టి ప్రజల ప్రాణాలపై సీఎంకు ఎంత చిత్తశుద్ధి ఉందో అర్ధమవుతోందని ఎద్దేవా చేశారు. పొరుగు రాష్ట్రాలు టీకా కొనుగోలుకు పోటీ పడుతుంటే జగన్మోహనరెడ్డి మాత్రం ప్రత్యర్థులపై రాజకీయ కక్ష తీర్చుకోవడానికి పోటీ పడుతున్నారని విమర్శించారు. జిల్లాలో సమయానికి బెడ్‌ దొరక్క భారతి అనే గర్భిణి కన్నుమూసిందని.. ఇలాంటి ఘటనలు రోజు జరుగుతూనే ఉన్నాయన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర పార్టీ కార్యనిర్వాహక కార్యదర్శి చిట్టాబత్తిని చిట్టిబాబు తదితరులు పాల్గొన్నారు.  

Updated Date - 2021-05-09T05:47:31+05:30 IST