ఆనంద్ మహింద్రా ఆసక్తికర ట్వీట్

ABN , First Publish Date - 2022-04-15T23:56:00+05:30 IST

న్యూఢిల్లీ : ఆసక్తికరమైన పోస్టులను నెటిజన్లతో పంచుకోవడంలో ఎల్లప్పుడూ ముందుంటారు దేశీయ పారిశ్రామిక దిగ్గజం ఆనంద్ మహింద్రా. ఆయన షేర్ చేసే పోస్టులు విశేషంగా ఆకట్టుకుంటుంటాయి.

ఆనంద్ మహింద్రా ఆసక్తికర ట్వీట్

న్యూఢిల్లీ : ఆసక్తికరమైన పోస్టులను నెటిజన్లతో పంచుకోవడంలో ఎల్లప్పుడూ ముందుంటారు దేశీయ పారిశ్రామిక దిగ్గజం ఆనంద్ మహింద్రా.  ఆయన షేర్ చేసే పోస్టులు విశేషంగా ఆకట్టుకుంటుంటాయి. ఇదే తరహా మరో పోస్ట్‌ను ఆయన పంచుకున్నారు. ఓ గూడ్స్ కంటెయినర్‌‌ను  మోసుకెళ్తున్న లారీ వెనుకాల క్రాష్ గార్డ్స్‌పై ‘‘టెస్ట్ యువర్ ఎయిర్‌బ్యాగ్స్ హియర్’’ అని రాసివుంది. సాధారణంగా ‘‘ కనీసం 50 మీటర్ల దూరం పాటించండి’’ అని రాసివుంటుంది. కానీ ఇందుకు ప్రత్యమ్నాయంగా ప్రదర్శించిన ‘టెస్ట్ యువర్ ఎయిర్‌బ్యాగ్స్ హియర్’ అనే ట్యాగ్ కూడా వెనుకాల వస్తున్న వాహనదారులను హెచ్చరిస్తోంది. కానీ కొంచెం కొంటెగా ‘మీ ఎయిర్‌బ్యాగ్స్‌ను ఇక్కడ పరిక్షించుకోండి’ అంటూ  ఢీకొట్టి చూడమని ఆహ్వానిస్తున్నట్టుగా ఉండడంతో ఈ పోస్టు నెటిజన్లను ఆకట్టుకుంటోంది. ఇది ఒక కుళ్లు జోకుగా ఓ నెటిజన్ నవ్వాడు. ఎవరు ధైర్యం చేస్తారు.. దమ్ముందా అని మరో నెటిజన్ సవాలు విసిరాడు. చాలా తెలివైన హెచ్చరిక అని మరికొందరు పేర్కొన్నారు. అత్యధికులు స్మైల్ ఎమోజీతో తమ ఉద్దేశ్యాన్ని తెలిపారు. మొత్తానికి మంచి ఫొటోని తమ దృష్టికి తీసుకొచ్చారని ఆనంద్ మహింద్రాని పొగిడారు.





Updated Date - 2022-04-15T23:56:00+05:30 IST