హైదరాబాద్ గ్యాంగ్ రేప్ కేసు: Anad Mahindra సంచలన వ్యాఖ్యలు.. వాళ్లెవరో నాకు తెలియదు కానీ..

ABN , First Publish Date - 2022-06-04T21:22:18+05:30 IST

హైదరాబాద్‌లో చోటు చేసుకున్న దారుణ ఘటనపై ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహేంద్ర ట్విట్టర్ వేదికగా స్పందించారు. మైనర్ బాలికపై జరిగిన అఘాయిత్యాన్ని ఖండించారు. ఇదే సమయంలో నిందితుల కుటుంబాలను ఉద్దేశిం

హైదరాబాద్ గ్యాంగ్ రేప్ కేసు: Anad Mahindra సంచలన వ్యాఖ్యలు.. వాళ్లెవరో నాకు తెలియదు కానీ..

ఇంటర్నెట్ డెస్క్: హైదరాబాద్‌లో చోటు చేసుకున్న దారుణ ఘటనపై ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహేంద్ర ట్విట్టర్ వేదికగా స్పందించారు. మైనర్ బాలికపై జరిగిన అఘాయిత్యాన్ని ఖండించారు. ఇదే సమయంలో నిందితుల కుటుంబాలను ఉద్దేశించి ప్రముఖ మీడియా సంస్థలు ఉపయోగించిన ఓ పదాన్ని ఆయన తప్పుబట్టారు. ఆ పదం ఎంత మాత్రం ఆమోదయోగ్యంగా లేదని పేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..



మీడియా మాటలతో ఏకీభవించని Anad Mahindra

ఈ ఘటనపై స్పందించిన ప్రముఖ వ్యాపారవేత్త Anad Mahindra.. బాలికపై జరిగిన దాడిని ఖండించారు. ఇదే సమయంలో నిందితులను ఉన్నత కుటుంబాలకు చెందిన వారిగా పేర్కొనడాన్ని ఆయన ఖండించారు. నిరుపేద కుటుంబాలకు చెందిన వారిగా వారిని అభివర్ణించారు. సంస్కృతి, మానవీయ విలువలు వంటి విషయాల్లో వారి కుటుంబాలు అట్టడుగు స్థాయిలో ఉన్నాయని అభిప్రాయపడ్డారు. తల్లిదండ్రుల పెంపకం సరిగా లేదని పేర్కొన్నారు. ‘ఆ కుర్రాళ్లు ఎవరో నాకు తెలియదు. కానీ కొన్ని మీడియా సంస్థలు వారిని ఉన్నత కుటుంబాల (influential’ families) పిల్లలుగా పేర్కొంటున్నాయి. నేను వాటితో ఏకీభవించను. నా దృష్టిలో మీడియా ఉపయోగించిన పదాలు సరైనవి కావు. ఆ పిల్లలు ఉన్నత కుటుంబాలకు చెందిన వాళ్లు కాదు. వారంతా పేద కుటుంబానికి చెందుతారు. సంస్కృతి, మానవీయ విలువలు వంటి విషయాల్లో వారి కుటుంబాలు అట్టడుగున ఉన్నాయి’ అంటూ ఆనంద్ మహేంద్ర ట్విట్టర్ పేర్కొన్నారు.


మైనర్ బాలికపై అత్యాచారం..

విదేశీయుడైన ఓ వ్యక్తి కొన్నేళ్ల క్రితం హైదరాబాద్ వచ్చి ఇక్కడే ఉద్యోగం చేస్తూ మహిళను వివాహం చేసుకున్నాడు. ఆ దంపతులకు కుమారుడు, కుమార్తె(16) ఉన్నారు. అతడి కుమార్తె ఓపెన్ స్కూల్‌లో ఇంటర్మీడియట్ చదువుతోంది. కాగా.. ఈ నెల 28న ఇంటి పక్కన ఉన్న హాదీ అనే ఈవెంట్ ఆర్గనైజర్ పిలుపు మేరకు ఆ బాలిక.. జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 36లోని పబ్‌లో ఏర్పాటు చేసిన పార్టీకి హాజరైంది. అదే పార్టీలో పాల్గొన్న ఐదుగురు కుర్రాళ్లు.. ఆమెకు మాయమాటలు చెప్పి బయటకు తీసుకెళ్లారు. అనంతరం ఆమెను కారులో బంధించి అత్యాచారానికి పాల్పడ్డారు. కూతురు ఒంటిపై ఉన్న గాయాలను చూసి ఆమె తల్లిదండ్రులు అనుమానం వ్యక్తం చేశారు. విషయం ఆరా తీయగా జరిగిన ఘోరం బయటపడింది. దీంతో ఆ బాలిక తండ్రి.. ఐదుగురు కుర్రాళ్లపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ కేసులో వక్ఫ్‌బోర్డు చైర్మన్ కుమారుడితోపాటు మరికొందరు రాజకీయ ప్రముఖుల పిల్లలు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.  రాజకీయ ప్రముఖల పిల్లలు ఉండటంతో ఈ ఘటన దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది. ఈ నేపథ్యంలోనే జాతీయ మీడియా సంస్థలు.. నిందితులను ఉన్నత కుటుంబాలకు చెందిన వ్యక్తులుగా పేర్కొంటూ కథనాలను ప్రచురించాయి. అయితే రాజకీయ ప్రముఖ



Updated Date - 2022-06-04T21:22:18+05:30 IST