భావి బ్రిటన్ పీఎం నివాసంపై Anand Mahindra మీమ్ అదిరింది!

ABN , First Publish Date - 2022-07-13T20:36:55+05:30 IST

బ్రిటన్ ప్రధాన మంత్రి పదవికి పోటీలో భారత సంతతికి చెందిన

భావి బ్రిటన్ పీఎం నివాసంపై Anand Mahindra మీమ్ అదిరింది!

న్యూఢిల్లీ : బ్రిటన్ ప్రధాన మంత్రి పదవికి పోటీలో భారత సంతతికి చెందిన రుషి సునక్ ముందు వరుసలో ఉన్నారు. కన్జర్వేటివ్ పార్టీ నేతగా, ప్రధాన మంత్రిగా ఎన్నికయ్యేందుకు ఎనిమిది మంది పోటీ పడుతున్నారు. ఈ నేపథ్యంలో మహీంద్ర గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్ర ట్వీట్ చేసిన మీమ్ ప్రతి భారతీయునికి గర్వకారణంగా నిలిచింది. బ్రిటన్ ప్రధాన మంత్రి నివాసం భవిష్యత్తులో ఎలా ఉండబోతోందో ఈ మీమ్‌లో చూపించారు. 


‘‘భవిష్యత్తులో 10 డౌనింగ్ స్ట్రీట్? సుప్రసిద్ధ బ్రిటిష్ సరదా సన్నివేశానికి ఇక దేశీయత జత కలుస్తుంది’’ అని పేర్కొన్నారు. ఈ ట్వీట్‌కు ఆయన 10 డౌనింగ్ స్ట్రీట్‌లోని బ్రిటన్ ప్రధాన మంత్రి నివాసం ఫొటోను హిందూ సంప్రదాయ చిహ్నాలతో అలంకరించి పోస్ట్ చేశారు. నూతన గృహ ప్రవేశం సందర్భంగా చేసే అలంకరణను చేశారు. ద్వారబంధానికి మామిడి తోరణాలు, స్వస్తిక్ చిహ్నాలను అలంకరించారు. ఇవన్నీ ఆధ్యాత్మికత, దైవత్వాలకు ప్రతీక అనే విషయం తెలిసిందే. 


రుషి సునక్ భారతీయ మూలాలుగల నేత. ఆయన ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తికి అల్లుడు. బ్రిటన్ ప్రధాన మంత్రి పదవికి బోరిస్ జాన్సన్ రాజీనామా చేసిన తర్వాత ఆ పదవి కోసం ఎనిమిది మంది నేతలు పోటీ పడుతున్నారు. కన్జర్వేటివ్ పార్టీ నేతగా, ప్రధాన మంత్రిగా ఎన్నికయ్యేందుకు ఆయన ప్రచారం ప్రారంభించారు. ఆయనకు పార్లమెంటులో చాలా మంది సీనియర్ నేతల మద్దతు ఉంది. బ్రెగ్జిట్ అనుకూల నేతగా రుషికి గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు చెప్తున్నారు. అధికార పార్టీని ఏకతాటిపైకి తీసుకురాగల సామర్థ్యంగల నేతగా ఆయనను పరిగణిస్తున్నారు. 


Updated Date - 2022-07-13T20:36:55+05:30 IST