Vaccine లేని ఇండియన్ సీఈవో వైరస్: Anand Mahindra వెటకారం!

ABN , First Publish Date - 2021-11-30T13:43:03+05:30 IST

తెలుగు తేజం, భారత కిరణం, గెలుపు కెరటం వంటి విశేషణాలతో విదేశాల్లో విజయం...

Vaccine లేని ఇండియన్ సీఈవో వైరస్: Anand Mahindra వెటకారం!

తెలుగు తేజం, భారత కిరణం, గెలుపు కెరటం వంటి విశేషణాలతో విదేశాల్లో విజయం సాధించిన మన వాళ్ల గురించి గర్వంగా చెప్పుకుంటాం కదా. ఇప్పుడు ట్విట్టర్‌కి ప్రవాస భారతీయుడైన పరాగ్ అగర్వాల్ సీఈవోగా నియమితులైన సందర్భంగా కూడా అదే జరుతుతోంది. అన్ని రకాల ప్రసార మాధ్యమాల్లో పరాగ్ గురించి వస్తోంది.


MicroSoft, Google, Adobe, IBM, Micron, Master Card లతో పాటు ఇప్పుడు Twitter మధ్య ఉమ్మడిగా ఉన్నదేమిటి? వాటి సీఈవోలు అందరూ ప్రవాస భారతీయులు కావడమే అంటూ కేటీఆర్‌తో సహా వివిధ రంగాల్లో ప్రముఖులు ఎందరో ట్వీట్స్ చేస్తున్నారు.


అయితే, నిత్యం సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉండే మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్ర మాత్రం తన తాజా ట్వీట్‌లో దీన్ని వెటకారం చేశారు. Indian CEO Virus అనేది కొత్త రకం Pandemic అనీ, భారతదేశంలో ఈ వైరస్ పుట్టిందని చెప్పుకోవడానికి మనం ఎంతో గర్వపడతామని మహేంద్ర ట్వీట్‌లో వ్యంగ్యంగా పెట్టారు. ఈ వైరస్‌కి మాత్రం Vaccine లేదని ఆయన హాస్యమాడారు. ఈ ట్వీట్‌పై నెటిజన్లు పెద్ద ఎత్తున కామెంట్లు, రీట్వీట్లు చేస్తున్నారు.



Updated Date - 2021-11-30T13:43:03+05:30 IST