Anand Mahindra, Nitin Gadkari : గడ్కరీకి ఆనంద్ మహీంద్రా విజ్ఞప్తి

ABN , First Publish Date - 2022-08-28T14:59:22+05:30 IST

కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ (Nitin Gadkari)కి పారిశ్రామికవేత్త ఆనంద్

Anand Mahindra, Nitin Gadkari : గడ్కరీకి ఆనంద్ మహీంద్రా విజ్ఞప్తి

న్యూఢిల్లీ : కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ (Nitin Gadkari)కి పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా (Anand Mahindra) ఓ విజ్ఞప్తి చేశారు. ఇరువైపులా చెట్లతో అందంగా ఉన్న ఓ రోడ్డుకు సంబంధించిన వీడియోను రీట్వీట్ చేసి, గ్రామీణ ప్రాంతాల్లో కొత్తగా నిర్మిస్తున్న రోడ్లకు ఇరువైపులా ఇదే విధంగా చెట్లను పెంచాలని కోరారు. 


ఆనంద్ మహీంద్రా షేర్ చేసిన వీడియోలోని రోడ్డు చాలా అందంగా కనిపిస్తోంది. ఇరువైపులా చెట్లతో ప్రకృతి సోయగం కనువిందు చేస్తోంది. కొంత దూరం నుంచి చూస్తే అదొక సొరంగంలా కనిపించింది. చెట్లు, సొరంగం కలిపి ఉన్నాయనే అర్థంలో దీనికి ట్రన్నెల్ (trees+tunnel=trunnel) అని పేరు పెట్టారు. సొరంగాలంటే తనకు చాలా ఇష్టమని ఆయన ఇచ్చిన ట్వీట్‌లో తెలిపారు. ఇలాంటి ట్రన్నెల్‌లో ప్రయాణించడానికి తాను ప్రాధాన్యమిస్తానని చెప్పారు. కొత్తగా నిర్మించే గ్రామీణ రోడ్ల మీద ఇలాంటి ట్రన్నెల్స్‌ నిర్మాణానికి ప్రణాళిక రచించగలమా గడ్కరీ గారూ? అని అడిగారు. 


ఈ వీడియో విపరీతంగా వైరల్ అవుతోంది. నెటిజన్లు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ఓ యూజర్ ఇచ్చిన ట్వీట్‌లో, కొల్హాపూర్, కొంకణ్ మధ్యలో ఉన్న రాధానగరి అటవీ ప్రాంతం ఈ విధంగానే ఉంటుందన్నారు. 





Updated Date - 2022-08-28T14:59:22+05:30 IST