మట్కామ్యాన్‌కు ఆనంద్ మహీంద్రా నివాళులు

ABN , First Publish Date - 2021-10-25T22:03:12+05:30 IST

మట్కామ్యాన్‌‌గా పేరున్న ఢిల్లీ సూపర్ హీరో అలగ్ నటరాజన్ కు పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్ర ఘననివాళులర్పించారు. ఇందుకు సంబంధించిన ఓ వీడియోను కూడా ఆయన షేర్ చేశారు.

మట్కామ్యాన్‌కు ఆనంద్ మహీంద్రా నివాళులు

న్యూఢిల్లీ : మట్కామ్యాన్‌‌గా పేరున్న ఢిల్లీ సూపర్ హీరో అలగ్ నటరాజన్ కు పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్ర ఘననివాళులర్పించారు. ఇందుకు సంబంధించిన ఓ వీడియోను కూడా ఆయన షేర్ చేశారు.  ఢిల్లీలోని వివిధ ప్రాంతాలకు మట్కామ్యాన్... మంచినీటిని సరఫరా చేస్తుండేవాడు. సాధారణంగా ఆసక్తికరమైన, సమాచారాన్నందజేసే పోస్టింగులకు మహీంద్ర ట్విట్టర్ ఖాతా వేదికగా ఉంటుందన్న పేరుంది. కాగా... క్లిష్ట పరిస్థితుల్లో ఆయా వ్యక్తులు సాధించిన మైలురాళ్ళు, విజయాలకు సంబంధించి మహీంద్రా తన ట్విట్లర్ ఖాతాలో పోస్ట్ చేస్తుంటారన్న విషయం తెలిసిందే.


ఆయన పోస్టింగులు ఆసక్తికంంగా, చదివించేలా ఉంటాయన్న పేరుంది. ఢిల్లీలో ప్రముఖునిగా ఉన్న మట్కామ్యాన్ కు సంబంధించిన ఓ వీడియోను  మహీంద్రా తన తాజా ట్వీట్‌లొ షేర్ చేశారు. తాజా తాగునీటిని ఢిల్లీ వాసులకు మట్కామ్యాన్(నటరాజన్) ఎలా అందించేవాడన్నది ఈ వీడియో సారాంశం. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌గా మారింది.  మట్కామ్యాన్... ఢిల్లీవాసుల మంచినీటి అవసరాలను తీర్చేక్రమంలో మట్కామెన్ కిందటి నెలలో తన పింఛను డబ్బుతోపాటు తన సేవింగ్స్ డబ్బును కలిపి ఓ మహీంద్ర బొలేరో మ్యాక్సీ వాహనాన్ని కూడా కొనుగోలు చేయడం విశేషం.


వీటితోపాటు కొంత మొత్తాన్ని తన శ్రేయోభిలాషుల నుంచి సేకరించాడు. మట్కామ్యాన్ ఈ వివరాలను తన వెబ్‌సైట్ లో పొందుపరచడం గమనార్హం. కాగా ఢిల్లీవాసుల త్రాగునీటి అవసరాలను తీర్చే క్రమంలో మట్కామ్యాన్ కొంనుగోలు చేసిన ట్రక్... వెయ్యి లీటర్ల సామర్ధ్యమున్న రెండు ట్యాంకులతో ఏర్పాటైంది. తాగునీటిని అందించడం ద్వారా తన సాధ్యమైనంత సేవలనందిస్తోన్న మట్కామ్యాన్‌కు మహీంద్రా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు కూడా. కాగా ‘సూపర్ హీరోగా అభివర్ణించబడుతోన్న మట్కామ్యాన్... బ్రిటన్ లో కేన్సర్‌ను జయించిన  ఓ వ్యాపారవేత్తకన్నా అధికుడంటూ ప్రశంసించడం విశేషం. 


మట్కామ్యాన్ క్యాన్సర్ ను జయించడం మరో విశేషం. ఆ తర్వాత... కేవలం పేదలకు సేవ చేసే సంకత్పంతోనే మట్కామ్యాన్... స్వదేశానికి తిరిగిరావడం గమనార్హం’ అంటూ ట్వీట్ చేసిన ఆనంద్ మహీంద్ర... ‘థాంక్యూ సర్’ అంటూ మట్కామ్యాన్‌కు కృతజ్ఞతలు తెలిపారు. కాగా ఈ నెల 24 న ఆనంద్ మహీంద్ర పోస్ట్ చేసిన వీడియోకు దాదాపు 63 వేల వ్యూస్ రావడం విశేషం. ఇవి ఇంకా పెరుగుతూ వస్తున్నాయి. మరోవైపు ఢిల్లీవాసుల దాహార్తిని తీర్చే క్రమంలో మట్కామ్యాన్ చేస్తున్న కృషికి ప్రజల నుంచి కూడా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. 


నిర్మాణ రంగంలో ఉండే కార్మికుల కోసం ప్రత్యేకంగా పోషకాహార సలాడ్‌లు తయారుచేసి పంచుతున్నారు. దారిలో కనిపించే సెక్యూరిటీ గార్డ్‌లు, డ్రైవర్లకు కూడా తన ఆపన్న హస్తం అందిస్తున్నారు. ఇలా తన సేవా దృక్పథంతో స్ఫూర్తిగా నిలుస్తోన్న నటరాజన్‌ గురించే ట్విట్టర్‌లో తెలియజేశారు ఆనంద్‌ మహీంద్రా. ఇందులో భాగంగా అతనిని మార్వెల్‌ హీరోతో పోల్చారు.

Updated Date - 2021-10-25T22:03:12+05:30 IST