అమరావతిపై నమ్మించి మోసం

ABN , First Publish Date - 2020-08-06T16:56:46+05:30 IST

అమరావతిని రాజధానిగా కొనసాగిస్తామని, మార్చమని ఎన్నికల ప్రచారంలో..

అమరావతిపై నమ్మించి మోసం

సీఎం జగన్‌పై ఆనందబాబు ధ్వజం


గుంటూరు(ఆంధ్రజ్యోతి): అమరావతిని రాజధానిగా కొనసాగిస్తామని, మార్చమని ఎన్నికల ప్రచారంలో చెప్పి, అధికారంలోకి వచ్చాక మాట మార్చి నమ్మిన ప్రజలను మోసం చేశారని సీఎం జగన్‌పై మాజీ మంత్రి నక్కా ఆనంద్‌బాబు మండిపడ్డారు. బుధవారం ఆన్‌లైన్‌ ద్వారా నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఆయన మా ట్లాడారు. రాజధాని అమరావతికి ఊపిరి పోస్తూ మూడు రాజధానుల బిల్లుపై హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడం హర్షణీయమన్నారు. కరోనా విపత్కర సమయంలో పట్టుసడలకుండా 232 రోజులుగా రైతులు ఆందోళనలు చేపడుతున్నా జగన్‌కు కనికరం కలగడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కర్నూలులో న్యాయ రాజధాని సాధ్యాసాధ్యాలు తెలిసి కూడా ప్రజలను మఽభ్యపెడుతున్నారని తెలి పారు. రాష్ట్రంలో కుంటుపడిన అభివృద్ధి, సంక్షేమ పథకాల్లో అవినీతి, కరోనా నిర్మూల నలో వైఫల్యం నుంచి ప్రజలదృష్టిని మళ్లించేందుకే మూడు రాజధానుల పేరిట సీఎం నాటకాలు ఆడుతున్నారని విమర్శించారు. సీఎం తుగ్లక్‌ నిర్ణయాల నుంచి రాష్ట్ర భవి ష్యత్తును రక్షించుకునేందుకు న్యాయస్థానాలే దిక్కని మన్నవ సుబ్బారావు అన్నారు. 


Updated Date - 2020-08-06T16:56:46+05:30 IST