Anakapalliలో పులి సంచారం... భయాందోళనలో గ్రామస్తులు

ABN , First Publish Date - 2022-07-14T18:29:05+05:30 IST

జిల్లాలో పులి సంచారం కలకలం రేపుతోంది.

Anakapalliలో పులి సంచారం... భయాందోళనలో గ్రామస్తులు

అనకాపల్లి: జిల్లాలో పులి సంచారం కలకలం రేపుతోంది. అనకాపల్లి, సబ్బవరం మండల గ్రామాల్లో ఇదిగో పులి అంటే... అదిగో పులి అంటూ గ్రామస్థులు భయాందోళనకు గురవుతున్నారు. తెల్లవారుజామున సబ్బవరం మండలం గొటివాడ వద్ద చోడవరం - సబ్బవరం ప్రధాన రహదారి దాటుతుండగా పులిని చూసిన బొలెరో వాహనం డ్రైవర్ అధికారులకు సమాచారం ఇచ్చాడు. వెంటనే అక్కడకు చేరుకుని అధికారులు... గొటివాడ పంట పొలాల వద్ద పులి పంజా పాదముద్రలను గుర్తించారు. కొన్ని గంటల వ్యవధిలోనే తిరిగి వంగలి వద్ద పులి పాదముద్రలను సిబ్బంది గుర్తించారు. పులి సంచారం నేపథ్యంలో చుట్టుపక్కల గ్రామస్థులు అప్రమత్తంగా ఉండాలంటూ సూచించారు. సబ్బవరం మండలం పల్లవాని పాలెం వద్ద పులిని బంధించేందుకు అటవీశాఖ సిబ్బంది రాత్రంతా మాటువేశారు. అయితే అధికారుల వ్యూహాలకు ఏమాత్రం చిక్కకుండా బెంగాల్ టైగర్ తప్పించుకు తిరుగుతోంది. పులి సంచారంతో గ్రామస్తులు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. 

Updated Date - 2022-07-14T18:29:05+05:30 IST