సివిల్‌ కేసుల్లో అనకాపల్లి డీఎస్పీ జోక్యం

ABN , First Publish Date - 2022-09-27T06:54:58+05:30 IST

ప్రజా సమస్యలపై ప్రశ్నించే టీడీపీ కార్యకర్తలు, నాయకులపై అక్రమ కేసులు పెడుతున్నారని, అనకాపల్లి డీఎస్‌పీ సునీల్‌కుమార్‌ భూ వ్యవహారాల్లో తలదూర్చి సెటిల్‌మెంట్లకు పాల్పడుతున్నారని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు, మాజీ మంత్రి చింతకాయల అయ్యయన్నపాత్రుడు ఆరోపించారు.

సివిల్‌ కేసుల్లో అనకాపల్లి డీఎస్పీ జోక్యం
ఎస్పీ కార్యాలయం వెలుపల విలేఖరులతో మాట్లాడుతున్న అయ్యన్నపాత్రుడు. పక్కన టీడీపీ నాయకులు

భూ సెటిల్‌మెంట్లకు కార్యాలయం అడ్డాగా మారింది

టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు అయ్యన్నపాత్రుడు ఆరోపణ

ఆధారాలజిల్లా ఎస్పీ గౌతమి శాలికి ఫిర్యాదు

టీడీపీ శ్రేణులపై అక్రమ కేసులు పెడితే సహించేది లేదని డీఎస్పీకి హెచ్చరిక

 అనకాపల్లి, సెప్టెంబరు 26 (ఆంధ్రజ్యోతి): ప్రజా సమస్యలపై ప్రశ్నించే టీడీపీ కార్యకర్తలు, నాయకులపై అక్రమ కేసులు పెడుతున్నారని, అనకాపల్లి డీఎస్‌పీ సునీల్‌కుమార్‌ భూ వ్యవహారాల్లో తలదూర్చి సెటిల్‌మెంట్లకు పాల్పడుతున్నారని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు, మాజీ మంత్రి చింతకాయల అయ్యయన్నపాత్రుడు ఆరోపించారు. డీఎస్పీ చేసిన ప్రైవేటు సెటిల్‌మెంట్లు, అక్రమాలపై సోమవారం స్పందన కార్యక్రమంలో భాగంగా జిల్లా ఎస్పీ గౌతమిశాలికి ఆధారాలతో సహా ఫిర్యాదు చేసినట్టు చెప్పారు. ఈ సందర్భంగా ఎస్పీ కార్యాలయం వెలుపల విలేఖరులతో మాట్లాడుతూ, సివిల్‌ కేసుల్లో డీఎస్పీ జోక్యం చేసుకుని టీడీపీ కార్యకర్తలను వేధిస్తున్నారని, డీఎస్పీ కార్యాలయం ల్యాండ్‌ సెటిల్‌మెంట్‌కు అడ్డాగా మారిందని ఆరోపించారు. రెవెన్యూ అధికారులు చేయాల్సిన పనులను పోలీసులు చేయడం ఎంతవరకు సమంజసమన్నారు. టీడీపీ కార్యకర్తలపై అక్రమ కేసులు పెడితే సహించేది లేదని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యేలు పీలా గోవింద సత్యనారాయణ, కేఎస్‌ఎన్‌ఎస్‌ రాజు, టీడీపీ నియోజకవర్గాల ఇన్‌చార్జులు  ప్రగడ నాగేశ్వరరావు (ఎలమంచిలి), బత్తుల తాతయ్యబాబు (చోడవరం), పీవీజీ కుమార్‌ (మాడుగుల), తెలుగు రైతు రాష్ట్ర ఉపాధ్యక్షుడు గూనూరు మల్లునాయుడు, నాయకులు కోట్ని బాలాజీ, కాయల మురళి, ఎం.సరేంద్ర తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2022-09-27T06:54:58+05:30 IST