మనుషులు లేని ద్వీపం!

ABN , First Publish Date - 2021-03-30T05:30:00+05:30 IST

అదొక చిన్న ద్వీపం. పెద్ద పెద్ద భవంతులు కనిపిస్తాయి. కానీ మనుషులు ఒక్కరు కూడా కనిపించరు. ఒకప్పుడు జనాలతో కిటకిటలాడిన ఆ ద్వీపం ఇప్పుడు దెయ్యాల ద్వీపంగా పేరుగాంచింది

మనుషులు లేని ద్వీపం!

అదొక చిన్న ద్వీపం. పెద్ద పెద్ద భవంతులు కనిపిస్తాయి. కానీ మనుషులు ఒక్కరు కూడా కనిపించరు. ఒకప్పుడు జనాలతో కిటకిటలాడిన ఆ ద్వీపం ఇప్పుడు దెయ్యాల ద్వీపంగా పేరుగాంచింది. 

  • జపాన్‌లోని నాగసాకి పట్టణానికి సమీపంలో ఉన్న ఈ ద్వీపానికి గుంకంజిమా అని పేరు. జపాన్‌ భాషలో యుద్ధనౌక అని అర్థం. ఈ ద్వీపం 480 మీటర్ల పొడవు, 150 మీటర్ల వెడల్పు ఉంటుంది. 
  • ఒకప్పుడు సముద్రగర్భంలో ఉన్న బొగ్గును తవ్వేవారు. కాలక్రమంలో బొగ్గు నిల్వలు తగ్గిపోవడం, కార్మికులు ఆ ద్వీపానికి వెళ్లి పనిచేయడాన్ని జైలుగా భావించడంతో తవ్వకాలు ఆపేశారు.
  • కార్మికులు నివసించిన సమయంలో నిర్మించిన పెద్దపెద్ద భవనాలు, ఆస్పత్రులు, పాఠశాలలు ఇప్పుడు బోసిపోయి కనిపిస్తాయి. మనుషులు లేకపోవడంతో ఆ ద్వీపం నిర్మానుష్మంగా మారింది. అందుకే  ఈ ద్వీపానికి ‘దెయ్యాల ద్వీపం’గా పేరు స్థిరపడింది.
  • ఈ ద్వీపంలో తరచుగా సినిమా షూటింగులు జరుగుతుంటాయి. అంతేకాదు పర్యాటకులను అనుమతిస్తుంటారు కూడా.

Updated Date - 2021-03-30T05:30:00+05:30 IST