Abn logo
Sep 27 2021 @ 00:22AM

రైలు నుంచి జారిపడి గుర్తుతెలియని యువకుడి మృతి

గుర్తుతెలియని మృతదేహాన్ని పరిశీలిస్తున్న తునిరైల్వే ఎస్‌ఐ మారూఫ్‌

కశింకోట, సెప్టెంబరు 26: రైలు నుంచి జారిపడి బయ్యవరం- నర్సింగబిల్లి రైల్వేస్టేషన్ల మధ్య గుర్తుతెలియని యువకుడు మృతిచెందాడని తుని రైల్వే ఎస్‌ఐ షేక్‌ అబ్దుల్‌ మారూఫ్‌ చెప్పారు. సంఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. గుర్తు తెలియని రైలు నుంచి సుమారు 35 ఏళ్ల వయసున్న యువకుడు జారిపడి మృతిచెందాడని, నీలం రంగు జీన్‌ షర్టు, నీలం రంగు ట్రాక్‌ ధరించి ఉన్నాడని చెప్పారు.  తెలుపు, ఎరుపు రంగు కలిగిన శాలువా ఉందని, కుడిచెయ్యిపై ఎస్‌.ప్రమీల అనే పచ్చబొట్టు ఉందన్నారు. మృతదేహాన్ని తుని ఏరియా ఆస్పత్రికి తరలించి,  కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. వివరాలు తెలిసిన వారు 9490619020, 9494887786 నంబర్లలో సంప్రతించాలని కోరారు.