Nizamabad కలెక్టరేట్‌లో వృద్ధురాలి ఆత్మహత్యాయత్నం

ABN , First Publish Date - 2022-06-27T19:27:06+05:30 IST

జిల్లా కలెక్టరేట్‌లో వృద్ధురాలి ఆత్మహత్యాయత్నం కలకలం రేపింది.

Nizamabad కలెక్టరేట్‌లో వృద్ధురాలి ఆత్మహత్యాయత్నం

నిజామాబాద్: జిల్లా కలెక్టరేట్‌లో వృద్ధురాలి ఆత్మహత్యాయత్నం కలకలం రేపింది. ఇంటిని తనకు తెలియకుండా కొడుకు అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకున్నాడని బాధితురాలు ఆరోపించారు. ఈ విషయాన్ని ప్రజావాణిలో ఫిర్యాదు చేసేందుకు ఎల్లమ్మ గుట్టకు చెందిన రుకుంబాయి కలెక్టరేట్‌కు వచ్చారు. తీవ్ర మనస్థాపానికి గురైన రుకుంబాయి కలెక్టరేట్ వద్ద ఉన్న చెట్టుకు ఉరివేసుకుని బలవన్మరణానికి ప్రయత్నించింది. వెంటనే స్పందించిన పోలీసులు వృద్ధురాలిని అడ్డుకున్నారు. 

Updated Date - 2022-06-27T19:27:06+05:30 IST