Abn logo
May 5 2021 @ 23:27PM

జలాశయంలో దూకి వృద్ధురాలు ఆత్మహత్య

మైలవరం, మే 5 : గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న నార్జాంపల్లికి చెందిన పోలుక లక్షుమ్మ (75)  మైలవరం జలాశయంలో పడి ఆత్మహత్య చేసుకున్నట్లు మైలవరం ఎస్‌ఐ ప్రవీణ్‌కుమార్‌ తెలిపారు. ఆయన వివరాల మేరకు... గత ఐదు సంవత్సరాల నుంచి లక్షుమ్మ అనారోగ్యంతో బాధపడుతుండేది. మంగళవారం వైద్యం కోసమని ఇంటి నుంచి జమ్మలమడుగుకు వచ్చిందని రాత్రి అయినా ఇంటికి రాకపోవడంతో బుధవారం వెతుకుతుండగా మైలవరం జలాశయంలో పడి చనిపోయినట్లు గుర్తించారు. ఆమె భర్త వెంకటసుబ్బారెడ్డి సంఘటనాస్థలానికి వెళ్లి తన భార్య అనారోగ్యంతో బాధపడుతుండేదని జలాశయంలో పడి ఆత్మహత్య చేసుకున్నట్లు మైలవరం పోలీసులకు ఫిర్యాదు చేశారని తెలిపారు. జలాశయం నుంచి మృతదేహాన్ని తీసి జమ్మలమడుగు ప్రభుత్వాస్పత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.

Advertisement
Advertisement
Advertisement