Abn logo
Aug 4 2020 @ 16:08PM

ఇది చూశాక మనుషులపై నమ్మకం పోయింది: ఆనంద్ మహీంద్రా

పక్క చిత్రం చూశారు కదా.. ఇందులో సమస్య ఏంటో ఒక్కచూపుతోనే అర్థమైపోయి ఉండాలి!  ఏది ఎలా నిర్మించాలి, ఎక్కడ నిర్మించాలి అనే విషయాలలో కనీసావగాహన లేకపోతే ఇదిగో ఇలాగే జరుతుంది. బాత్‌రూమ్‌లో నీరు సులభంగా పోయేలా మోరీని నిర్మించాల్సింది పోయి.. ఇలా నిరుపయోగ నిర్మాణం చేపట్టారు. ఈ చిత్రాన్ని ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా ట్విటర్ ద్వారా షేర్ చేశారు. దీన్ని చూసి నాకు కూడా  మనుషులు సరైన నిర్ణయాలు తీసుకుంటారన్న నమ్మకం పోయిందంటూ సరదా వ్యాఖ్య చేశారు.


‘సాధారణంగా..మనషులు తమ సౌకర్యానికి, అవసరానికి అనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటారని నేను బలంగా నమ్ముతాను. కానీ ఈ చిత్రం చూసేసరికి నాకు ఆ నమ్మకం పోయింది’ అంటూ ఆయన కామెంట్ చేశారు. ఇక ఈ ట్వీట్ వైరల్ అవడంతో నెటిజన్లు కూడా తాము చూసిన వింత చిత్రాలతో రిప్లై ఇచ్చారు. మరికొందరు..మనుషుల మూర్ఖత్వానికి అంతేలేదు అంటూ నిట్టూర్చారు. కొందరు ఆశాజీవులు మాత్రం.. మోరీని అలా డిజైన్ చేయడానికి ఏదో కారణం ఉండే ఉంటుందని.. మిగత అంతా బాగానే రూపొందించినట్టన్నారు కదా.. అంటూ ప్రశ్నించారు. 


Advertisement
Advertisement