అంతర్జాతీయ ఒప్పందం కావాలి

ABN , First Publish Date - 2022-05-24T08:42:19+05:30 IST

భవిష్యత్తులో కరోనా తరహా మహమ్మారులు విజృంభిస్తే వాటిని ఎలా ఎదుర్కోవాలో..

అంతర్జాతీయ ఒప్పందం కావాలి

సీరమ్‌ ఇన్‌స్టిట్యూట్‌ సీఈవో అదర్‌ పూనావాలా

లండన్‌, మే 23: భవిష్యత్తులో కరోనా తరహా మహమ్మారులు విజృంభిస్తే వాటిని ఎలా ఎదుర్కోవాలో.. ఏమేం చేయకూడదో, ఏమేం చేయాలో ఒక అవగాహన వచ్చిందని సీరమ్‌ ఇన్‌స్టిట్యూట్‌ సీఈవో అదర్‌ పూనావాలా అన్నారు. ఈ అనుభవంతో ప్రపంచం ఈ తరహా ముప్పులను మరింత మెరుగ్గా ఎదుర్కోవడానికి సిద్ధమైందని.. అయితే అలా జరగడానికి వీలుగా ‘గ్లోబల్‌ పాండెమిక్‌ ట్రీటీ’ వంటి ఒప్పందాలు కుదరాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. దావో్‌సలో జరుగుతున్న ఎకనమిక్‌ ఫోరమ్‌లో పాల్గొన్న పూనావాలా ఒక ఆంగ్ల వార్తాసంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పూనావాలా పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ‘‘ముడిపదార్థాలను, టీకాలను పంచుకునే విషయంలోగానీ.. టీకా ధ్రువీకరణ పత్రాలను గుర్తించే విషయంలోగానీ.. క్లినికల్‌ ట్రయల్స్‌, టీకాల తయారీ విధానాలు, మరిన్ని టీకాల ఉత్పత్తి వంటి విషయాల్లో ఏయే తప్పులు జరిగాయో మనందరికీ తెలుసు’’ అని ఆయన గుర్తుచేశారు. అలాంటి తప్పులను పరిహరించాలంటే అంతర్జాతీయ ఒప్పందాలు అవసరమన్నారు. ఆయన అభిప్రాయం ప్రకారం ఇలాంటి మహమ్మారులు వ్యాపించినప్పుడు.. 


దేశాల మధ్య ముడిపదార్థాలు, టీకాల సరఫరాకు ఆటంకాలు ఉండకూడదు. 

టీకా తయారీ రూపకర్తలకు ప్రయోజనం కలిగించేలా మేధోహక్కులను వాణిజ్య విధానంలో పంచుకోవాలి

వైరస్‌ నియంత్రణ ప్రమాణాలకు సంబంధించి అంతర్జాతీయ ఒప్పందం ఉండాలి

అంతర్జాతీయ ప్రయాణ టీకా ధ్రువీకరణపత్రాలను డిజిటల్‌ ప్లాట్‌ఫామ్‌పై ఉంచాలి.


దీనికి సంబంధించిన ముసాయిదా పత్రాన్ని దావో్‌సలో జరిగే సమావేశాల్లో సర్క్యులేట్‌ చేస్తామని పూనావాలా చెప్పారు. మరోవైపు.. టీకా సమానత్వం, టీకాల తయారీ సా మర్థ్యాన్ని పెంపొందించుకోవడం, ఇతర దేశాలకు సరఫరా వంటి అంశాల్లో భారత్‌ మంచి ఉదాహరణగా నిలిచిందని దా వో్‌సకు వచ్చిన పలుసంస్థల అధిపతులు అభిప్రాయపడ్డారు.  

Updated Date - 2022-05-24T08:42:19+05:30 IST