లాఠీచార్జీపై సిట్టింగ్‌ జడ్జితో విచారణ జరిపించాలి

ABN , First Publish Date - 2022-07-02T05:03:42+05:30 IST

ఈ నెల 14న గౌరవెల్లి రిజర్వాయర్‌ గుడాటిపల్లి భూ నిర్వాసితులపై పోలీసులు, టీఆర్‌ఎస్‌ నాయకులు జరిపిన దాడులపై సిట్టింగ్‌ జడ్జితో విచారణ జరిపించి బాఽధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని సీపీఐ జిల్లా కార్యదర్శి మంద పవన్‌ డిమాండ్‌ చేశారు.

లాఠీచార్జీపై సిట్టింగ్‌ జడ్జితో విచారణ జరిపించాలి

సీపీఐ జిల్లా కార్యదర్శి మంద పవన్‌ 

హుస్నాబాద్‌, జూలై 1: ఈ నెల 14న గౌరవెల్లి రిజర్వాయర్‌ గుడాటిపల్లి భూ నిర్వాసితులపై పోలీసులు, టీఆర్‌ఎస్‌ నాయకులు జరిపిన దాడులపై సిట్టింగ్‌ జడ్జితో విచారణ జరిపించి బాఽధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని సీపీఐ జిల్లా కార్యదర్శి మంద పవన్‌ డిమాండ్‌ చేశారు. శుక్రవారం హుస్నాబాద్‌ పట్టణంలోని అనభేరి, సింగిరెడ్డిల అమరుల భవనంలో జరిగిన హుస్నాబాద్‌, అక్కన్నపేట మండలాల సీపీఐ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. గౌరవెల్లి ప్రాజెక్టులో భూములు కోల్పోయిన నిర్వాసితులు చేస్తున్న శాంతియుత ఆందోళనలకు సంఘీభావం తెలిపిన సీపీఐ నేతలపై టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం కక్ష సాధింపుతో అక్రమ కేసులు పెట్టిందని తెలిపారు. పోలీసులతో లాఠీచార్జి జరిపినందుకు సీఎం కేసీఆర్‌ భూ నిర్వాసితులకు భేషరుతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. ఈ సమావేశంలో సీపీఐ రాష్ట్ర సమితి సభ్యుడు గడిపె మల్లేశ్‌, మండలాల కార్యదర్శులు వనేష్‌, నాయకులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-07-02T05:03:42+05:30 IST