ఆవుల్లో ఒత్తిడి తగ్గించడానికి వినూత్న ప్రయోగం

ABN , First Publish Date - 2021-06-10T05:30:00+05:30 IST

సంగీతం వింటే ఒత్తిడి దూరమవుతుంది. ఇదే సూత్రాన్ని ఆవులకు వర్తింపచేసే ప్రయత్నాల్లో ఉన్నారు రష్యాలోని ఓ డెయిరీ ఫామ్‌ యజమాని. అయితే ఇక్కడ మ్యూజిక్‌కు బదులుగా ఆవులకు

ఆవుల్లో ఒత్తిడి తగ్గించడానికి వినూత్న ప్రయోగం

సంగీతం వింటే ఒత్తిడి దూరమవుతుంది. ఇదే సూత్రాన్ని ఆవులకు వర్తింపచేసే ప్రయత్నాల్లో ఉన్నారు రష్యాలోని ఓ డెయిరీ ఫామ్‌ యజమాని. అయితే ఇక్కడ మ్యూజిక్‌కు బదులుగా ఆవులకు వర్చ్యువల్‌ రియాలిటీ (వీఆర్‌) హెడ్‌సెట్‌ను ఉపయోగిస్తున్నారు. ఇలా చేయడం వల్ల ఆవుల్లో ఒత్తిడి తగ్గి పాలు బాగా ఇస్తాయని భావిస్తున్నారు. 


ఇందుకోసం ఆవుల కోసం ప్రత్యేకంగా వీఆర్‌ హెడ్‌సెట్‌లను తయారుచేయించారు. ఈ ఫోటోలు సోషల్‌మీడియాలో వైరల్‌ అయ్యాయి. కొంతమంది ఫేక్‌ అని కొట్టిపారేశారు. కానీ ఆ ఫొటోలు నిజమేనని, ప్రయోగంలో భాగంగా ఆవులకు హెడ్‌సెట్‌  పెట్టి ఫలితాలను సమీక్షిస్తున్నామని అక్కడి వ్యవసాయ మంత్రిత్వశాఖ ప్రకటించింది.


గతంలో డెయిరీ ఫామ్‌లలో మంచి సంగీతం ప్లే చేయడం ద్వారా ఆవులలో పాల ఉత్పత్తి పెరిగేలా చేసే వారు. ఇప్పుడు టెక్నాలజీ చాలా అడ్వాన్స్‌ అయింది. అందుకే వీఆర్‌ని వాడుతున్నారు. 


ఇంతకీ వీఆర్‌ హెడ్‌సెట్స్‌లో ఆవులకు ఏం చూపిస్తున్నారో తెలుసా? పచ్చిక బయళ్లు, వర్షపు జల్లులు కురుస్తున్న వీడియోలు చూపిస్తున్నారు. వీటివల్ల ఆవుల్లో ఒత్తిడి తగ్గి పాల ఉత్పత్తి బాగా పెరుగుతోందట. 

Updated Date - 2021-06-10T05:30:00+05:30 IST