యువతకు వినూత్న ఉపాధిమార్గం.. ఇంటింటికీ వెళ్లి సేవలు అందిస్తున్న యువకుడు!

ABN , First Publish Date - 2021-11-18T17:54:06+05:30 IST

కరోనా ప్రభావం దేశాన్ని ఇంకా వీడలేదు.

యువతకు వినూత్న ఉపాధిమార్గం.. ఇంటింటికీ వెళ్లి సేవలు అందిస్తున్న యువకుడు!

కరోనా ప్రభావం దేశాన్ని ఇంకా వీడలేదు. ఈ మహమ్మారి కొందరిని ఆరోగ్యపరంగా దెబ్బతీస్తే, ఉద్యోగం, ఉపాధిపరంగా మరికొందరిపై వేటు పడింది. ఇదేసమయంలో ఆర్థిక సమస్యల్లో చిక్కుకున్నవారు కొత్త ఉపాధిమార్గాలను ఎంచుకున్నారు. ఇదే కోవలో బీహర్‌కు చెందిన రోషన్ రాజ్ నూతన ఉపాధిని ఎన్నుకుని, మంచి ఆదాయాన్ని ఆర్జిస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు.


 కటిహార్ జిల్లాకు చెందిన రోషన్ రాజ్ తాను ఏర్పాటు చేసుకున్న నూతన ఉపాధిమార్గం ద్వారా పలువురు యువకులకు స్ఫూర్తినిస్తున్నాడు. తన మోపెడ్‌కు పిండిమర బిగించి వీధుల్లో తిరుగుతూ అవసరమైన వినియోగదారులకు బియ్యన్ని, పప్పులను పిండి ఆడించి ఇస్తున్నాడు. రోషన్ రాజ్ చేస్తున్న ఈ పనికి వినియోగదారుల నుంచి మంచి ఆదరణ లభిస్తోంది. వినియోగదారుల ఎదురుగానే రోషన్ రాజ్ పిండి ఆడిస్తుండటంతో వారు సంతృప్తి చెందుతున్నారు. దీనిని గమనించిన రోషన్ చుట్టుపక్కల గ్రామాల్లోనూ తిరుగుతూ తన వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకుంటున్నాడు.

Updated Date - 2021-11-18T17:54:06+05:30 IST