భారత్‌లోని ఈ రాష్ట్రంలో మద్యం బంద్.. ఏకంగా పక్క దేశానికి క్యూ కడుతున్న మందు బాబులు..!

ABN , First Publish Date - 2022-05-20T18:23:34+05:30 IST

భారత్‌లోని అత్యధిక జనాభా కలిగిన రాష్ట్రాలలో బీహార్ ఒకటి. ఆ రాష్ట్రాన్ని పాలిస్తున్న నితీష్ కుమార్ 2016లో మద్యపాన నిషేధం విధించారు.

భారత్‌లోని ఈ రాష్ట్రంలో మద్యం బంద్.. ఏకంగా పక్క దేశానికి క్యూ కడుతున్న మందు బాబులు..!

భారత్‌లోని అత్యధిక జనాభా కలిగిన రాష్ట్రాలలో బీహార్ ఒకటి. ఆ రాష్ట్రాన్ని పాలిస్తున్న నితీష్ కుమార్ 2016లో మద్యపాన నిషేధం విధించారు. రాష్ట్రంలోని నేరాలకు, మహిళల కష్టాలకు మద్యపానమే కారణమని భావించిన సీఎం మందుబాబులకు షాకిచ్చారు. మద్యం కోసం కొన్ని రోజులు అల్లాడిన మందుబాబులు ఆ తర్వాత నేపాల్ బాట పట్టారు. నేపాల్ దేశంతో బీహార్‌ సుదీర్ఘంగా 400 కి.మీ. సరిహద్దును కలిగి ఉంది. దీంతో సరిహద్దు ప్రాంతంలోని మందు బాబులు సాయంత్రం కాగానే చక్కగా నేపాల్ వెళ్లిపోతున్నారు. 

ఇది కూడా చదవండి..

నెట్టింట సెలబ్రెటీ అయిన ఈ యువతిని అరెస్ట్ చేయాలంటూ డిమాండ్లు.. ఇంతకీ ఈమె చేసిన నిర్వాకమేంటంటే..


నేపాల్‌లో రాత్రి 9 గంటల వరకు వైన్ షాప్‌లు, బార్‌లు తెరిచి ఉంటాయి. సాయంత్రానికే నేపాల్ సరిహద్దు ప్రాంతాలకు చేరుకుంటున్న బీహార్ మందుబాబులు అక్కడ మద్యం సేవించి రాత్రికి తిరిగి భారత్‌కు వస్తున్నారు. దీంతో బీహార్‌లో మద్యపాన నిషేధం పెద్దగా ఫలితాన్ని ఇవ్వడం లేదు. రాష్ట్రం భారీ మొత్తంలో ఆదాయాన్ని కోల్పోతోంది. పైగా నేపాల్ నుంచి అక్రమంగా వస్తున్న మద్యాన్ని వ్యాపారులు బ్లాక్‌లో అధిక ధరలకు విక్రయిస్తున్నారు. పోలీసులు, ఎక్సైజ్ ఎంత నిఘా పెట్టినా ఫలితం ఉండడం లేదు. నేపాల్, భారత్ మధ్య ఓపెన్ బోర్డర్ అగ్రిమెంట్ ఉన్న సంగతి తెలిసిందే. ఇరు దేశాల వ్యక్తులూ ఎలాంటి అనుమతి పత్రాలు లేకుండానే రాకపోకలు సాగించవచ్చు. 


ఇరు దేశాల సరిహద్దు ప్రాంతాల ప్రజలు మద్యం కోసమే కాదు.. ఇతర వస్తువుల కోసం కూడా బోర్డర్ దాటుతుంటారు. బైక్ స్పేర్ పార్ట్స్ నేపాల్ కంటే భారత్‌లో చౌక. అలాగే పెట్రోల్, డీజిల్ ధరలు భారత్‌లో కంటే నేపాల్‌లో చౌక. అలాగే ఇంటికి, వంటకు అవసరమయ్యే సామాన్లు కొనేందుకు నేపాల్‌కు చెందిన చాలా మంది మహిళలు బీహార్‌కు వెళ్తుంటారు. 

Updated Date - 2022-05-20T18:23:34+05:30 IST