‘ఆపిల్’లో బగ్‌ను కనిపెట్టిన భారత హ్యాకర్.. రూ.75 లక్షల నజరానా ఇచ్చిన కంపెనీ

ABN , First Publish Date - 2020-06-01T02:22:01+05:30 IST

ప్రముఖ ఆపిల్ కంపెనీ వెబ్‌సైట్‌లో ఉన్న ఓ బగ్‌ను ఢిల్లీకి చెందిన ఓ సాఫ్ట్‌వేర్ డెవలపర్ కనిపెట్టాడు. దీంతో ఆపిల్ కంపెనీ అతడికి...

‘ఆపిల్’లో బగ్‌ను కనిపెట్టిన భారత హ్యాకర్.. రూ.75 లక్షల నజరానా ఇచ్చిన కంపెనీ

న్యూఢిల్లీ: ప్రముఖ ఆపిల్ కంపెనీ లాగ్‌ఇన్‌కు సంబంధించిన ఓ బగ్‌ను ఢిల్లీకి చెందిన ఓ సాఫ్ట్‌వేర్ డెవలపర్ కనిపెట్టాడు. దీంతో ఆపిల్ కంపెనీ అతడికి భారీ నగదును నజరానాగా అందజేసింది. వివరాల్లోకి వెళితే ఢిల్లీలో నివశించే భావుక్ జైన్ సాఫ్ట్‌వేర్ డెవలపర్‌గా పనిచేస్తున్నాడు. ఈ నేపథ్యంలో ఆపిల్ అధికారిక వెబ్‌సైట్‌లో ఓ బగ్ ఉన్నట్లు భావుక్ గుర్తించాడు.  దీంతో ఆ విషయాన్ని సంస్థకు తెలియజేశాడు. ఈ బగ్ వల్ల ఆపిల్ అకౌంట్ వివరాలను వినియోగించుకునే థర్డ్ పార్టీ అప్లికేషన్లపై ప్రభావం ఉంటుందని, దీని ద్వారా వినియోగదారుడి ఖాతా మొత్తం వేరొకరి ఆధీనంలోకి వెళ్లిపోయే ప్రమాదం కూడా ఉందని ఆపిల్‌కు తెలిపాడు. దీంతో ఆ సంస్థ భావుక్‌ జైన్‌కు లక్ష డాలర్లు(రూ.75 లక్షలు) అందజేసింది. అంతేకాకుండా ఈ బగ్‌ను పూర్తిగా సరిచేశామని ఆపిల్ ప్రకటించింది.

Updated Date - 2020-06-01T02:22:01+05:30 IST