ఓ చిన్న ఐడియా ఆమె జీవితాన్నే మార్చేసింది.. రూ.వెయ్యి పెట్టుబడితో వ్యాపారం.. ఇప్పుడు రూ.4 కోట్ల టర్నోవర్..

ABN , First Publish Date - 2021-12-14T18:18:55+05:30 IST

ఎంత మంది స్పెషలిస్ట్ డాక్టర్ల చుట్టూ తిరిగినా తగ్గని జబ్బు ఒక్కోసారి వంటింటి చిట్కాతో తగ్గిపోతుంటుంది.

ఓ చిన్న ఐడియా ఆమె జీవితాన్నే మార్చేసింది.. రూ.వెయ్యి పెట్టుబడితో వ్యాపారం.. ఇప్పుడు రూ.4 కోట్ల టర్నోవర్..

ఎంత మంది స్పెషలిస్ట్ డాక్టర్ల చుట్టూ తిరిగినా తగ్గని జబ్బు ఒక్కోసారి వంటింటి చిట్కాతో తగ్గిపోతుంటుంది. ఇంట్లోని నాయనమ్మలు, బామ్మలు చెప్పే చిట్కాలు బ్రహ్మాండంగా పనిచేస్తుంటాయి. ఇటీవలి కాలంలో వంటింటి చిట్కాలను చాలా మంది నమ్ముతున్నారు. ప్రకృతి సిద్ధమైన ఔషధాలకు మంచి గిరాకీ పెరిగింది. దీంతో చాలా మంది వాటితో వ్యాపారం చేయడానికి ముందుకొస్తున్నారు. కోల్‌కతాకు చెందిన ఓ యువతి ఇదే పద్ధతిలో ఏకంగా రూ.4 కోట్ల టర్నోవర్ సాధించింది. 


కోల్‌కతాకు చెందిన ఆకాంక్ష మోదీ అనే మహిళ తమ ఇంట్లో స్వయంగా తయారు చేసిన స్కిన్ కేర్ ప్రోడక్ట్స్ అమ్మకాన్ని నాలుగేళ్ల క్రితం ప్రారంభించింది. కేవలం వెయ్యి రూపాయల పెట్టుబడితో ప్రారంభమైన ఆ  వ్యాపారం నేడు రూ.4 కోట్ల టర్నోవర్‌కు ఎదిగింది. ఆమె ఉత్పత్తులకు భారత్‌లోనే కాకుండా యూకే, సింగపూర్, అమెరికాల్లో కూడా వినియోగదారులున్నారు. `నేను చిన్నప్పటి నుంచి మా నాన్నమ్మ చెప్పే వంటింటి చిట్కాలను ఆసక్తిగా వినేదాన్ని. ఆ తర్వాత కాస్మోటిక్స్ కెమిస్ట్‌గా బ్యాచిలర్ డిగ్రీ పట్టా పుచుకున్నాను. ఆయుర్వేదానికి సంబంధించిన పుస్తకాలు చదివాను. అయితే వ్యాపారం చేయాలన్న ఆలోచన నాకు లేదు. 


ఐదేళ్ల క్రితం మా అత్తగారికి చర్మ సంబంధ వ్యాధులు వచ్చాయి. ఎంత మంది వైద్యుల చుట్టూ తిరిగినా తగ్గలేదు. దాంతో నాకు తెలిసిన కొన్ని మూలికలతో ఆయుర్వేద పద్ధతిలో ఆమెకు చికిత్స చేశాను. కొన్ని రోజులకు ఫలితం కనిపించింది. ఆ తర్వాత చాలా మంది నా గురించి తెలుసుకుని ఔషధాల గురించి అడిగేవారు. చాలా మందికి ఉచితంగానే ఇచ్చేదాన్ని. దానికి బాగా డిమాండ్ పెరిగింది. ఆ సమయంలో నా భర్త సలహాతో ఆ వ్యాపారం ప్రారంభించాను. 


మార్కెట్‌కు వెళ్లి రూ.250తో ముడి సరకులు కొని సహజ సిద్ధంగా ఔషధం తయారు చేశాము. మౌత్ పబ్లిసిటీతోనే మా ఔషధానికి మంచి డిమాండ్ ఏర్పడింది. దాంతో క్రమక్రమంగా విస్తరించుకుంటూ వెళ్లాం. ప్రస్తుతం 80 రకాల ఔషధాలను తయారు చేస్తున్నాం. మా కంపెనీలో ప్రస్తుతం 52 మంది పనిచేస్తున్నారు. వారిలో మహిళలే ఎక్కువ మంది. సోషల్ మీడియా ద్వారా ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్స్‌లో మా ఉత్పత్తులను విక్రయిస్తున్నామ`ని ఆకాంక్ష చెప్పారు. 


Updated Date - 2021-12-14T18:18:55+05:30 IST