Advertisement
Advertisement
Abn logo
Advertisement

పుస్తక ప్రియులను ఆకట్టుకున్న ప్రదర్శన

బాపట్ల: బాపట్ల రసరంజనీ ఆధ్వర్యంలో స్థానిక సూర్యకాళీ పంక్షన్‌ ప్లాజాలో పుస్తక ప్రదర్శన ఏర్పాటు చేశారు. ప్రదర్శనలో వివిధ విభాగాలకు చెందిన విలువైన పుస్తకాలను ఉంచి ఎంపిక చేసుకున్న వ్యక్తికి 10 పుస్తకాలు చొప్పున ఉచితంగా అందజేశారు. కార్య క్రమాన్ని వక్కలగడ్డ రాధాకృష్ణమూర్తి ప్రారంభించారు. డాక్టర్‌ భీరం సుందరరావు, నాళం శ్రీని వాసరావులు తమ గ్రంథాలయాల్లో భద్ర పరిచిన పుస్తకాలను ఉచితంగా ఇచ్చి పుస్తకప్రియులకు అందేవిధంగా చేశారు. ప్రజలలో పఠనాభిలాషను తిరిగి పెంపొందించాలనే ఉద్దేశంతో ఈ ఉత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు బూరుగుల సంగమేశ్వరశాస్ర్తి తెలిపారు. కార్యక్రమంలో విశ్రాంత ప్రిన్సి పాల్‌ డాక్టర్‌ పివి.కృష్ణయ్య, రచయిత తిమ్మనశ్యామ్‌ సుందర్‌, కవి నందిరాజువిజయ్‌కుమార్‌, బొమ్మన బోయిన సాంబయ్య, తదితరులు పాల్గొన్నారు. 


Advertisement
Advertisement