బీర్బల్‌ తెలివి!

ABN , First Publish Date - 2020-08-06T05:30:00+05:30 IST

విదేశీయుడైన ఒక పండితుడు అక్బర్‌ రాజ్యానికి సందర్శకుడిగా వచ్చాడు. ఒకరోజు అక్బర్‌ సభకు వచ్చి ఆ పండితుడు ‘‘నేను తెలివైన వాడిని, నా ప్రశ్నలకు ఎవరూ సమాధానం చెప్పలేరు’’ అన్నాడు...

బీర్బల్‌ తెలివి!

విదేశీయుడైన ఒక పండితుడు అక్బర్‌ రాజ్యానికి సందర్శకుడిగా వచ్చాడు. ఒకరోజు అక్బర్‌ సభకు వచ్చి ఆ పండితుడు ‘‘నేను తెలివైన వాడిని, నా ప్రశ్నలకు ఎవరూ సమాధానం చెప్పలేరు’’ అన్నాడు. 

దానికి సభికులు ‘మీకన్నా బీర్బల్‌ చాలా తెలివైన వాడ’ని అన్నారు. దాంతో ఆ పండితుడు ‘‘నా ప్రశ్నలకు సమాధానం చెప్పు’’ అంటూ బీర్బల్‌కు సవాలు విసిరాడు. ‘‘వంద సులభమైన ప్రశ్నలు అడగమంటారా? కఠినమైన ప్రశ్న ఒకటి అడగమంటారా?’’ అని బీర్బల్‌ను చులకన చేస్తూ అన్నాడు.  అప్పుడు బీర్బల్‌ ‘‘కఠినమైన ప్రశ్న ఒక్కటే అడగండి’’ అని ఆత్మవిశ్వాసంతో అన్నాడు. అయితే ‘‘కోడి ముందా? గుడ్డు ముందా?’’ అని అడిగాడు పండితుడు. ‘‘కోడే ముందు’’ అని సమాధానం ఇచ్చాడు బీర్బల్‌. ‘‘నీకెలా తెలుసు?’’ అని ఎగతాళిగా అడిగాడు పండితుడు. ‘‘ఒకటే ప్రశ్న అడుగుతానని ఒప్పుకున్నావు. ఒక ప్రశ్న అడిగావు. మళ్లీ రెండో ప్రశ్న ఎందుకు అడుగుతున్నావు?’’ అన్నాడు బీర్బల్‌. దాంతో ఆ పండితుడు తల దించుకుని వెళ్లిపోయాడు. 

Updated Date - 2020-08-06T05:30:00+05:30 IST