Chitrajyothy Logo
Advertisement
Published: Sun, 26 Jun 2022 20:18:36 IST

Rashtra Kavach Om నుంచి ఎమోషనల్ సాంగ్ విడుదల

twitter-iconwatsapp-iconfb-icon

టీవీ నుంచి చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టి నటుడిగా మారిన వ్యక్తి ఆదిత్య రాయ్ కపూర్ (Aditya Roy Kapur). ‘లండన్ డ్రీమ్స్’ సినిమాతో బీ టౌన్ ఇండస్ట్రీకీ ఎంట్రీ ఇచ్చారు. ‘ఆషీకీ-2’ చిత్రంతో భారీ హిట్ కొట్టారు. తాజాగా ఆయన నటించిన సినిమా ‘రాష్ట్ర కవచ్ ఓమ్’ (Rashtra Kavach Om). సంజన సంఘీ (Sanjana Sanghi) హీరోయిన్‌గా నటించారు. కపిల్ వర్మ దర్వకత్వం వహించారు. ఈ సినిమా జులై 1న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం ప్రమోషన్స్‌లో భాగంగా సినిమా నుంచి కొత్త పాటను విడుదల చేసింది.


మేకర్స్ సినిమాలోని ‘సెహర్’(Seher) అనే పాటను జూన్ 26న రిలీజ్ చేశారు. ఈ సాంగ్‌ను అర్జిత్ సింగ్ అలపించారు. లిరిక్స్‌ను ఏఎమ్. తురాజ్ రాశారు. ఆర్కో సంగీతం అందించారు. ఈ పాట ఎమోషనల్‌గా సాగింది. హీరో, హీరోయిన్‌ల మధ్య సన్నివేశాలను హృద్యంగా ఆవిష్కరించారు. మ్యూజిక్ ఆకట్టుకుంది. ఈ పాటలో ప్రకాష్ రాజ్ కూడా కనిపించారు. ఈ ప్రాజెక్టు కోసం ఆదిత్య రాయ్ కపూర్, సంజన సంఘీ మొదటిసారిగా కలసి పనిచేస్తున్నారు. ఈ సినిమాకు ‘ఓమ్: ద బ్యాటిల్ వితిన్’ అని గతంలో టైటిల్ పెట్టారు. ఏమైందో తెలియదు కానీ మేకర్స్ ప్రస్తుతం ఆ టైటిల్‌ను ‘రాష్ట్ర కవచ్ ఓమ్’ గా మార్చారు. ఈ సినిమాలో జాకీ ష్రాఫ్, ఆశుతోష్ రాణా, విక్రమ్ కొచ్చర్, విక్కీ అరోరా కీలక పాత్రలు పోషించారు. ‘ఏ పేపర్ డాల్ ఎంటర్‌టైన్‌మెంట్ ప్రొడక్షన్‌’ తో కలసి ‘జీ స్టూడియోస్’ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించింది.


Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International

BollywoodLatest Telugu Cinema Newsమరిన్ని...