Advertisement
Advertisement
Abn logo
Advertisement

వీడెక్కడి ప్రియుడండీ బాబూ.. ప్రేయసిని కలిసేందుకు రోజూ రాత్రిళ్లు ఊరంతా పవర్ కట్.. గ్రామస్తులు రెడ్‌హ్యాండె‌డ్‌గా పట్టుకుని ఏం చేశారంటే..

ప్రియురాలిని కలిసేందుకు ప్రియుడు ఎంతకైనా తెగిస్తుంటాడు. ఈ క్రమంలో ఏది మంచి, ఏది చెడు అనే విషయం కూడా మర్చిపోతుంటారు. ఓ ప్రేమికుడు తన ప్రియురాలిని కలిసేందుకు ఏకంగా ఊరంతా పవర్ కట్ చేసేవాడు. ఎవరూ తమను చూడొద్దని రాత్రి వేళల్లో ఇలా చేసేవాడు.  రోజూ ఒకే సమయంలో పవర్ కట్ అవుతుండడంతో గ్రామస్తులకు అనుమానం వచ్చింది. తర్వాత నిఘా పెట్టడంతో విషయం బయటపడింది. వివరాల్లోకి వెళితే..

బీహార్‌లోని పూర్ణియా జిల్లాలోని గణేష్‌పూర్ అనే గ్రామంలో ఇటీవల రోజూ ఒకే సమయంలో పవర్ కట్ అవుతుండేది. అయితే పక్క ఊర్లలో మాత్రం కరెంట్ ఉండేది. దీంతో కొన్నాళ్లకు గ్రామస్తులకు అనుమానం వచ్చింది. నిఘా పెట్టడంతో అసలు విషయం తెలిసింది. విద్యుత్ శాఖలో పని చేస్తున్న ఓ వ్యక్తే దీనికి కారణం అని తెలుసుకున్నారు. ఆ గ్రామంలో ఓ వితంతు మహిళ.. ఒంటరిగా నివాసం ఉంటోంది. గ్రామంలో విద్యుత్ శాఖలో ఉద్యోగిగా చేరిన వ్యక్తికి ఆమెతో పరిచయం ఏర్పడింది. రోజూ ఆమెను కలిసేందుకు వెళ్లేవాడు. అయితే తమను ఎవరూ గుర్తించవద్దని కరెంట్ కట్ చేసేవాడు. సమీపంలోని పాఠశాలల ఆవరణలో మహిళతో గడిపేవాడు.

రోజూ ఒకే సమయంలో కరెంట్ పోతుండడంతో మొదట కోతలేమో అనుకున్నారు. కానీ పక్క గ్రామాల్లో మాత్రం కరెంట్ ఉండడంతో అనుమానం వచ్చి నిఘా పెట్టారు. పాఠశాలలో మహిళతో ఉన్న వ్యక్తిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. దేహశుద్ధి చేసిన అనంతరం గుండు కొట్టించి, గ్రామమంతా ఊరేగించారు. అలాగే సదరు మహిళతో గ్రామ సర్పంచ్ సమక్షంలో వివాహం జరిపించారు. అయితే దీనిపై తమకు ఫిర్యాదు అందలేదని పోలీసులు తెలిపారు.

ఇవి కూడా చదవండిImage Caption

Advertisement

ప్రత్యేకంమరిన్ని...

Advertisement