ట్రాన్స్‌జెండర్‌ దంపతులను అక్కున చేర్చుకున్న వృద్ధదంపతులు

ABN , First Publish Date - 2022-04-17T00:17:58+05:30 IST

చంఢీగడ్ : వెక్కిరింతలు, చీత్కారాలు, హేళనలు ఇవీ సమాజం ఆమెకిచ్చిన బహుమతులు. ఎక్కడికెళ్లినా అవమానాలు, చిన్నచూపులే.

ట్రాన్స్‌జెండర్‌ దంపతులను అక్కున చేర్చుకున్న వృద్ధదంపతులు

చంఢీగడ్ : వెక్కిరింతలు, చీత్కారాలు, హేళనలు ఇవీ సమాజం ఆమెకిచ్చిన బహుమతులు. ఎక్కడికెళ్లినా అవమానాలు, చిన్నచూపులే. చివరికి కన్నతల్లీదండ్రుల ప్రేమకూ నోచుకోలేకపోయిన ధనంజయ్ అనే ట్రాన్స్‌జండర్‌‌ దంపతులను వృద్ధదంపతులు అక్కున చేర్చుకున్నారు. భారత్‌లో మానవీయత, దత్తత గుణానికి దర్పం పడుతున్న ఈ ఘటన చంఢీగడ్‌లో వెలుగుచూసింది. శంషేర్ చాహల్(93), ఆమె భర్త, అడ్వకేట్ దర్భర సింగ్ చాహల్(95)లు ఇద్దరూ తమ కూతురు ధనంజయ్, ఆమె భర్త రుద్ర ప్రతాప్ సింగ్‌(ట్రాన్స్‌జెండర్)ను తమ ఇంట్లోకి సాధారంగా ఆహ్వానించారు. తల్లిదండ్రుల ఆప్యాయతను పంచుతున్నారు. ధనంజయ్‌ను దత్తతు తీసుకోవడంలో చాహల్ దంపతులను వారి కూతుళ్లు కథక్, సమీరా కొసర్ ఎంతగానో ప్రోత్సహించారు. 


కొత్త జీవితం ఆనందంగా సాగిపోతుండడంపై ధనంజయ్ స్పందిస్తూ.. ఉద్వేగానికి గురయింది. ‘‘దత్తతు తీసుకున్నట్టు మాకు అనిపించడం లేదు. అందరం చాలా బాగా కలిసిపోయాం. మా అందరి మధ్య చాలా ప్రేమ ఉంది. పరస్పరం జాగ్రతలు తీసుకుంటున్నాం. ఇలాంటి తల్లిదండ్రులు దొరికినందుకు మేమే చాలా అదృష్టవంతులం. ఒకసారైతే అర్ధరాత్రి సమయానికి కూడా మేము ఇంటికి చేరుకోలేకపోయాం. మేము ఇంటికి వెళ్లేదాకా ఇంట్లోవాళ్లు ఎదురుచూస్తూనే ఉన్నారు. అమ్మానాన్నలకు చాలా దగ్గరయ్యాం.  అందరం కలిసి తింటున్నాం. సంతోషాలు, బాధలను పంచుకుంటున్నాం’’ అని ధనంజయ్ వెల్లడించింది.


సమాజంలో గుర్తింపు పొందేందుకు దశాబ్దాల సమయం పట్టిందని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. 2014లో సుప్రీంకోర్ట్ ఇచ్చిన తీర్పు ఎంతో కీలకమైనది. దాదాపు 5 లక్షల మంది ట్రాన్స్‌జెండర్లను గుర్తిస్తూ సుప్రీం తీర్పు ఇచ్చింది. ట్రాన్స్‌జెండర్లను మూడవ కేటగిరి వ్యక్తులుగా గుర్తిస్తూ సుప్రీంకోర్ట్ తీర్పు ఇవ్వడంతో ప్రత్యేక గుర్తింపు లభించినట్టయిందని ధనంజయ్ పేర్కొంది. ప్రత్యేక గుర్తింపు వచ్చినా పరిస్థితిలో ఎలాంటి మెరుగుదల లేదని ధనంజయ్ వాపోయింది. పరిస్థితులు చాలా మెరుగుపడాల్సి ఉందని సూచించింది. కాగా ధనంజయ్ ట్రాన్స్‌జెండర్ హక్కుల ఉద్యమకారురాలు. పంజాబ్ యూనివర్సిటీకి చెందిన తొలి ట్రాన్స్‌జెండర్ స్టూడెంట్ కూడా ఆమే. ఎల్‌జీబీటీక్యు కమ్యూనిటీకి సంబంధించిన చదువుల్లో ఆమె బిజీగా ఉంది.

Updated Date - 2022-04-17T00:17:58+05:30 IST