నాటక రంగానికి పూర్వ వైభవానికి కృషి

ABN , First Publish Date - 2022-05-18T07:09:49+05:30 IST

నాటక రంగానికి పూర్వవైభవం తెచ్చేందుకు జ్యోతిప్రకాష్‌ యువజన నాట్యమండలి చేస్తున్న కృషి మరవలేనివని తెలంగాణ నాటక సమాజాల సమాఖ్య రాష్ట్ర సహాయ కార్యదర్శి ధర్మూరి వెంకటేశ్వర్లు, జిల్లా అధ్యక్షుడు కంబాల శ్రీనివాస్‌ అన్నారు.

నాటక రంగానికి పూర్వ వైభవానికి కృషి
నాటక ప్రదర్శనలో కళాకారులు

మఠంపల్లి, మే 17: నాటక రంగానికి పూర్వవైభవం తెచ్చేందుకు జ్యోతిప్రకాష్‌ యువజన నాట్యమండలి చేస్తున్న కృషి మరవలేనివని తెలంగాణ నాటక సమాజాల సమాఖ్య రాష్ట్ర సహాయ కార్యదర్శి ధర్మూరి వెంకటేశ్వర్లు, జిల్లా అధ్యక్షుడు కంబాల శ్రీనివాస్‌ అన్నారు. మండల కేంద్రంలో జ్యోతిప్రకాష్‌ యువజన నాట్యకళామండలి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న తెలుగు రాష్ట్రాల స్థాయి నటనా కౌశల్యం పోటీలు చివరి రోజు మంగళవారం రసవత్తరంగా కొనసాగాయి. ఈ సందర్భంగా వారు మాట్లాడారు.  ప్రాధాన్యం కోల్పోతున్న నాటక రంగానికి పునరుత్తేజం కల్పిస్తున్న కళా పరిషత్తు చైర్మన్‌ భోనగిరి ప్రకాష్‌బాబు అభినందనీయు డన్నారు. తెలుగు నాటక ప్రదర్శన సజీవ కళారూపమన్నారు. ఉభయ రాష్ట్రాల్లోని  13 జిల్లాలకు చెందిన కళాకారులు మొదటి రోజు 48మంది, రెండో రోజు 48మంది, చివరి రోజు 51మంది ఏకపాత్రాభినయాలు, నాటక సన్నివేశాలను ప్రదర్శించారు. ఉదయం తొమ్మిది గంటలకే ప్రారం భమైన పోటీలు స్వల్ప విరామాలతో అర్ధరాత్రి దాటక కూడా కొనసా గాయి. శ్రీకృష్ణుడు,  శ్రీకృష్ణ రాయభారం, శ్రీరామాంజనేయ యుద్ధం, సత్యహరిశ్చంద్ర, విశ్వామిత్రుడు, మాయలఫకీరు, అల్లూరి సీతారామ రాజు తదితర నాటకాల్లో పాత్రలు పలువురుని ఆకట్టుకున్నాయి. ప్రతిభ కనపరిచిన కళాకారులకు నగదు బహుమతితో పాటు ప్రశంసా పత్రా లను ఇచ్చి కమిటీ వారు సన్మానించారు.  పలువురు ప్రజాప్రతి నిధులు, నాయకులు, అధికారులను కూడా యువజన నాట్యమండలి  సభ్యులు సన్మానించారు. కార్యక్రమంలో జడ్పీటీసీ జగన్‌నాయక్‌, ఎంపీపీ పార్వతి కొండా నాయక్‌, సర్పంచ్‌ మన్నెం శ్రీనివాస్‌రెడ్డి, జ్యోతి ప్రకాష్‌ యువజన నాట్యకళా మండలి అధ్యక్ష, కార్యదర్శులు భోనగిరి ప్రకాష్‌బాబు, భద్రంరాజు రామారావు, గొలమారి థామస్‌రెడ్డి, భోనగిరి ఆనంద్‌, జోసు, భద్రయ్యచారి, వెంకటశివ, విజయ్‌, ప్రభుకుమార్‌, వెంకటేశ్వర్లు, న్యాయ నిర్ణేతలుగా పాకాలపాటి రోషయ్య, పీసీబీ దాసు, వల్లంరాజు త్యాగ రాజులు వ్యవరించారు. కళాకారులకు, దూర ప్రాంతాల నుంచే ప్రేక్షకు లకు ఓజో ఫౌండేషన్‌ అధినేత పిల్లుట్ల రఘు ఆధ్వర్యంలో ఉచిత అన్న దానం,  తాగునీరు, మజ్జిగ ప్యాకెట్లు అందించారు.



Updated Date - 2022-05-18T07:09:49+05:30 IST