త్వరలోనే రాక్షస పాలనకు చరమగీతం

ABN , First Publish Date - 2021-10-23T05:31:32+05:30 IST

వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాష్ట్రంలో అరాచక పాలన పెరిగి పోయిందని, రాక్షస పాలనకు చరమగీతం పాడే రోజులు దగ్గరలో ఉన్నాయని మాజీ ఎమ్మెల్యే మద్దనకుంట ఈరన్న అన్నారు.

త్వరలోనే రాక్షస పాలనకు చరమగీతం
నాయకులతో కలిసి దీక్షలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే

-నిరసన దీక్షలో మాజీ ఎమ్మెల్యే ఈరన్న

మడకశిర టౌన, అక్టోబరు 22: వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాష్ట్రంలో అరాచక పాలన పెరిగి పోయిందని, రాక్షస పాలనకు చరమగీతం పాడే రోజులు దగ్గరలో ఉన్నాయని మాజీ ఎమ్మెల్యే మద్దనకుంట ఈరన్న అన్నారు. శుక్రవారం పార్టీ కార్యాలయంలో పార్టీ అధినేత చంద్రబాబు 36 గంటల దీక్షకు మద్దతు తెలిపారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ రోజు రోజుకూ రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణిస్తున్నాయని కక్షసాధింపు చర్యగా పాలన సాగిస్తున్నారని విమర్షించారు. అక్రమాలను ప్రశ్నిస్తే ప్రతిపక్ష నేతల గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. ప్రతిపక్షనేత నేతలపై అక్రమ కేసులు బనాయించడం, వేదించడమే లక్ష్యంగా పెట్టుకొన్నారన్నారు. గతంలో ఎన్నడూ కూడా ఇలాంటి సంఘటనలు జరిగిన సందర్భాలు లేవని అన్నారు. రాష్ట్రంలో నెలకొన్న ఆర్థిక పరిస్థితులపై నుంచి దృష్టి మళ్లించేందుకు ఇలాంటి దాడులకు  పాల్పడుతున్నారని విమర్శించారు. వరుసగా జరుగుతున్న దాడులను చూస్తుంటే రాష్ట్రంలో ఇంటలిజెన్స వ్యవస్థ ఉందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయన్నారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణపై దృష్టి సారించాలన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ ఆదినారాయణ, అశ్వర్థరామప్ప, నాయకులు కిష్టప్ప, రాజగోపాల్‌, నాగరాజు, నర్సేగౌడ్‌, కోట్ల రంగేగౌడ్‌ తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2021-10-23T05:31:32+05:30 IST