యాప్‌లో పరిచయమైన వ్యక్తితో మహిళ డేటింగ్ నిర్ణయం.. అయితే కలవడానికి కాస్త ముందు.. అతడి గురించి తెలిసి..
ABN , First Publish Date - 2021-12-29T01:52:24+05:30 IST
అమెరికాలో ఓ మహిళకు డేటింగ్ యాప్ ద్వారా ఓ వ్యక్తి పరిచయమయ్యాడు. పరిచయం అనంతరం ఆ మహిళ కూడా అతడితో డేటింగ్ చేసేందుకు నిర్ణయించుకుంది. అయితే..
ప్రస్తుతం ఎక్కడెక్కడో ఉండే మనుషులు.. ఆన్లైన్ వేదికగా రోజుల్లోనే స్నేహితులుగా మారిపోతున్నారు. కొందరైతే అంతే వేగంగా ప్రేమించుకుంటూ, పెళ్లిళ్లు కూడా చేసుకుంటూ ఉంటారు. చాలా మంది సంసారాలు సవ్యంగా సాగుతుంటే.. కొందరు మాత్రం చివరకు దారుణంగా మోసపోతుంటారు. ఇటీవల డేటింగ్ కూడా సర్వసాధారణమైంది. ఇందుకోసం ప్రత్యేకంగా అనేక యాప్‌లు కూడా ఉండడం తెలిసిందే. అమెరికాలో ఓ మహిళకు డేటింగ్ యాప్ ద్వారా ఓ వ్యక్తి పరిచయమయ్యాడు. పరిచయం అనంతరం ఆ మహిళ కూడా అతడితో డేటింగ్ చేసేందుకు నిర్ణయించుకుంది. అయితే కలవడానికి కాస్త ముందు.. అతడి గురించి తెలిసి షాక్ అయింది. వివరాల్లోకి వెళితే..
అమెరికాలోని నాష్‌విల్లేలో ఉంటున్న షైనా కే కార్డ్వెల్.. ఓ కంపెనీలో రిక్రూట్మెంట్ మేనేజర్‌గా పనిచేస్తోంది. డేటింగ్ కోసం ఆమె వివిధ యాప్‌లలో మగవారి కోసం వెతుకుతూ ఉండేది. ఇటీవల ఓ యాప్‌లో ఆమెకు ఓ వ్యక్తి పరిచయమయ్యాడు. అతడితో కొన్నాళ్లు చాటింగ్ చేసింది. ఈ క్రమంలో డేటింగ్ చేద్దామని ఆ వ్యక్తి తన కోరికను బయటపెట్టాడు. ఆ వ్యక్తి ప్రవర్తన బాగుండడంతో మహిళ కూడా అందుకు అంగీకరించింది. ఇద్దరూ కలిసి ఓ నిర్ణయానికి వచ్చారు. తాను డేటింగ్ చేయబోయే వ్యక్తిని కలవడానికి కాస్త ముందు.. అతడి గురించి తెలుసుకోవాలని ఆమె గూగుల్‌లో సెర్చ్ చేసింది. అయితే అతడి గురించి తెలియగానే ఆమె ఒక్కసారిగా అవాక్కయింది.
భర్తపై అలిగి పుట్టింటికి వెళ్లిన భార్య.. ఆమెను పిలుచుకురావడానికి వెళ్లి.. మద్యం మత్తులో భర్త చేసిన పని..
గూగుల్‌లో అతడి పేరును ఎంటర్ చేయగానే.. ఆమెకు పలు సంచలన విషయాలు తెలిశాయి. కిడ్నాప్ కేసులో గతంలో అతడు అరెస్ట్ అయినట్లు తెలిసింది. అలాగే అతడిపై వివిధ కేసులు నమోదై ఉండడం చూసి షాక్ అయింది. డేటింగ్‌కు ముందే అతడి గురించి తెలియడంతో హమ్మయ్య.. అంటూ ఊపిరి పీల్చుకుంది. అనంతరం తన అనుభవాలను సోషల్ మీడియా వేదికగా పంచుకుంది. కొత్త వ్యక్తులతో డేటింగ్ చేసే సమయంలో.. జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. సదరు వ్యక్తుల గురించి పూర్తిగా తెలుసుకున్నాకే.. డేటింగ్ చేయాలని సలహాలు ఇస్తోంది.