అమెజాన్ ఉద్యోగి ఆగ్రహం.. సంస్థకు 45 లక్షల నష్టం!

ABN , First Publish Date - 2020-07-14T19:47:20+05:30 IST

అమెజాన్ ఉద్యోగి ఆగ్రహం కారణంగా సంస్థకు దాదాపు 45 లక్షల రూపాయల 60 వేల డాలర్ల నష్టం వాటిల్లింది.

అమెజాన్ ఉద్యోగి ఆగ్రహం.. సంస్థకు 45 లక్షల నష్టం!

థార్న్‌టన్: అమెజాన్ ఉద్యోగి ఆగ్రహం కారణంగా సంస్థకు దాదాపు 45 లక్షల రూపాయల (60 వేల డాలర్లు) నష్టం వాటిల్లింది. స్టీవెన్ కోహెన్ అనే ఉద్యోగి కారుతో సహా అమెజాన్ కేంద్రంలోకి దూసుకెళ్లడంతో భవనం ముందువైపు ఉన్న తలుపులు ధ్వంసమయ్యాయి. అక్కడితో ఆగని సదరు ఉద్యోగి కారును భనవం వెనుకవైపుకు తీసుకెళ్లి అక్కడ ఇదే తరహాలో అరాచకం సృష్టించాడు. దీంతో సంస్థకు కనీసం 60 వేల డాలర్ల నష్టం జరిగి ఉంటుందని అక్కడి అధికారులు భావిస్తున్నారు. కోలరాడో రాష్ట్రంలోని థార్న్‌టర్న్ మున్సిపాలిటీలోని అమెజాన్ కేంద్రంలో శనివారం రాత్రి ఈ దారుణం జరిగింది. అయితే..ఘటనకు మునుపు.. అతడు పైఅధికారులతో ఎటువంటి వాగ్వివాదానికీ దిగలేదని తెలుస్తోంది. దీంతో అతడి ఆగ్రహానికి గల కారణమేంటనేది తెలుసుకునేందుకు పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. 

Updated Date - 2020-07-14T19:47:20+05:30 IST