సీఎం నాయకత్వంలో అఖిలపక్ష బృందాన్ని ఢిల్లీ తీసుకెళ్లాలి

ABN , First Publish Date - 2022-08-11T05:05:39+05:30 IST

పార్లమెంట్‌ సమావేశాల్లో ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధత కల్పించేందుకు ముఖ్యమంత్రి నాయకత్వంలో అఖిలపక్ష బృందాన్ని ఢిల్లీకి తీసుకెళ్లాలని ఏపీ ఎమ్మార్పీయస్‌ నాయకులు డిమాండ్‌ చేశారు.ఏపీ ఎమ్మార్పీయస్‌ ఆధ్వర్యంలో బుధవారం నాలుగు రోడ్లు కూడలి నుంచి ర్యాలీగా తహసీల్దారు కార్యాలయం వచ్చి తహసీల్దారు వెంకటేశ్వర్లుకు వినతి పత్రం అందించారు.

సీఎం నాయకత్వంలో అఖిలపక్ష బృందాన్ని ఢిల్లీ తీసుకెళ్లాలి

ఎమ్మార్పీఎస్‌ డిమాండ్‌

ముద్దనూరు, ఆగస్టు10: పార్లమెంట్‌ సమావేశాల్లో ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధత కల్పించేందుకు ముఖ్యమంత్రి నాయకత్వంలో అఖిలపక్ష బృందాన్ని ఢిల్లీకి తీసుకెళ్లాలని ఏపీ ఎమ్మార్పీయస్‌ నాయకులు డిమాండ్‌ చేశారు.ఏపీ ఎమ్మార్పీయస్‌ ఆధ్వర్యంలో బుధవారం నాలుగు రోడ్లు కూడలి నుంచి ర్యాలీగా తహసీల్దారు కార్యాలయం వచ్చి తహసీల్దారు వెంకటేశ్వర్లుకు వినతి పత్రం అందించారు.ఈ కార్యక్రమంలో ఏపీ ఎమ్మార్పీయస్‌ నాయకులు పాములేటి, నడిపి ఓబులేసు, పెద్దన్న, శ్రీరాములు, పుల్లయ్య మాదిగ, సహదేవుడు మాదిగ తదితరులు పాల్గొన్నారు.

ప్రొద్దుటూరు అర్బన్‌..: పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో ఎస్సీవర్గీకరణ కు చట్టబద్ధత కల్పిస్తూ బీజేపీ ప్రభుత్వం ఇచ్చిన హామీని నెరవేర్చాలని సీఎం జగన్‌ నాయకత్వంలో అఖిల పక్ష బృందాన్ని ఢిల్లీకి తీసుకెళ్లాని  ఏపీ ఎమ్మార్పీఎస్‌ రాష్ట్ర మాజీ కార్యదర్శి బాల లక్షుమయ్య జిల్లా కన్వీనర్‌ చెన్నమ్మలు డిమాండ్‌చేశారు.బుధవారం స్ధానిక తహసీల్దారు కార్యాలయం వద్ద ఎంఆర్‌పిఎస్‌ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు.  అనంతరం తహసీల్దారు నజీర్‌ అహ్మద్‌కు వినతి పత్రం అందజేశారు.కార్యక్రమంలో డప్పు చర్మకారుల సంఘం రాష్ట్ర కన్వీనర్‌ నాగభూషణం, వెంకటరాముడు, రఘరాముడు,నరసింహులు, జీవన్న, మైసూరయ్య, గంగులయ్య తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-08-11T05:05:39+05:30 IST