Abn logo
Jun 21 2021 @ 00:30AM

కృష్ణా జలాలపై అఖిలపక్ష సమావేశం నిర్వహించాలి

 సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు రంగారెడ్డి
మిర్యాలగూడ, జూన 20 :
కృష్ణా జలాల విషయంలో ప్రభు త్వం అఖిలపక్ష సమావేశం నిర్వహించి నీటి వాటా కోసం సీరియస్‌గా పోరాడాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు జూలకంటి రంగారెడ్డి అన్నారు. స్థానిక పార్టీ కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కృష్ణా జలాలపై ఏపీ సీఎం ప్రకటన అన్యాయమని కేసీఆర్‌ ఖం డించడం హర్షనీయమన్నారు. రాష్ట్ర ప్రజల ప్రయోజనాల కోసం అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి ఐక్యంగా పోరాడాలని ప్రభు త్వాన్ని కోరారు. ప్రభుత్వం ప్రతి జిల్లాలో వెయ్యి ఎకరాల భూమి ని విక్రయించాలనుకోవడం అన్యాయమన్నారు. డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు, ప్రభుత్వ కార్యాలయాల నిర్మాణాలకు స్థలం దొరకక ఇబ్బందులు పడుతుంటే ఉన్న స్థలాలను అమ్మి అభివృద్ధి చేస్తామనడం దుర్మార్గమన్నారు. అప్పులు తెచ్చి, భూములు అమ్మి రీడిజైన, రీబడ్జెట్ల పేరుతో కమీషన్లకు కక్కుర్తిపడి రాష్ట్ర సంపదనను దుర్వినియోగం చేస్తున్నారని విమర్శించారు. ప్రభుత్వ ఏకపక్ష నిర్ణయాల తో ప్రజలు నష్టపోవాల్సి వస్తోందన్నారు. రాష్ట్ర ప్రయోజనాలకు అనుగుణంగా ప్రభుత్వం నిర్ణయాలు తీసుకోవాలని కోరారు. సమా వేశంలో సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యులు డబ్బికార్‌ మల్లేష్‌, రైతుసంఘం నాయకులు వీరేపల్లి వెంకటేశ్వర్లు, జిల్లా కమిటీ సభ్యులు జగదీష్‌చంద్ర తదితరులు పాల్గొన్నారు.