nancy pelosi: నాన్సీ పెలోసీకి అతనితో లవ్వా.. పెళ్లి కూడానా.. ఈ వైరల్ ఫొటో వెనుక అసలు నిజం ఏంటంటే..

ABN , First Publish Date - 2022-08-04T22:14:13+05:30 IST

అమెరికా కాంగ్రెస్ దిగువ సభ స్పీకర్ నాన్సీ పెలోసీ (nancy pelosi) తైవాన్‌లో (taiwan) పర్యటించడంతో ఆమెకు సంబంధించిన విషయాలు ప్రస్తుతం హాట్ టాపిక్‌గా..

nancy pelosi: నాన్సీ పెలోసీకి అతనితో లవ్వా.. పెళ్లి కూడానా.. ఈ వైరల్ ఫొటో వెనుక అసలు నిజం ఏంటంటే..

అమెరికా కాంగ్రెస్ దిగువ సభ స్పీకర్ నాన్సీ పెలోసీ (Nancy Pelosi) తైవాన్‌లో (taiwan) పర్యటించడంతో ఆమెకు సంబంధించిన విషయాలు ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారాయి. తాజాగా ఆమె పెళ్లి ఫొటో పేరుతో ఒక ఫొటో నెట్టింట చక్కర్లు కొడుతోంది. చైనాకు చెందిన జర్నలిస్ట్ హు జిజిన్‌తో (Hu Xijin) పెలోసీ ప్రేమాయణం సాగించి పెళ్లి చేసుకున్నట్లు ఓ రొమాంటిక్ లవ్ స్టోరీ నెట్టింట హంగామా చేసింది. అయితే.. ఆ ఫొటో, ఆ లవ్ స్టోరీ అంతా ఫేక్ అని తేలిపోయింది. ఒక ట్విట్టర్ యూజర్ ఆ ఫొటోను పోస్ట్ చేసి.. "When they were young: Nancy Pelosi and Hu Xijin" అని ట్వీట్ చేశాడు.


నాన్సీ పెలోసీ, చైనాకు చెందిన గ్లోబల్ టైమ్స్ న్యూస్‌పేపర్ మాజీ చీఫ్ ఎడిటర్ హు జిజిన్ యుక్త వయసులో ఉన్నప్పుడు కలిసి ఉన్నట్టు కనిపించిన ఫొటో అది. ఆ ఫొటో ఫేక్ అని మొత్తానికి తేలిపోయింది. వారిద్దరూ యుక్త వయసులో ఉన్నప్పటి ఫొటోలను సేకరించి.. ఫొటోషాప్‌లో ఇద్దరినీ పక్కపక్కనే ఉన్నట్టుగా క్రియేట్ చేసినట్లు Fact Check లో తెలిసింది. నాన్సీ యుక్త వయసులో ఉండగా తన కుటుంబంతో కలిసి దిగిన ఫొటోను గతంలో Flickr లో "With family as a young girl" అనే క్యాప్షన్‌తో పోస్ట్ చేసింది. ఆ ఫొటోను తీసుకొచ్చి ఇలా ఫొటోషాప్ చేశారు. అసలు నాన్సీతో పాటు ఆ ఫొటోలో ఉన్నది ఆమె తండ్రి థామస్ డి.అలెసాండ్రో జూనియర్. ఆయన కూడా అమెరికాకు చెందిన పొలిటీషన్ కావడం గమనార్హం. ఆమె క్యాంపెయిన్ పేజెస్‌లో కూడా ఈ ఫొటో కనిపించింది.


ఇక.. హు జిజిన్ ఫొటో విషయానికొస్తే.. ఆయన చైనా సైన్యంలో ఉన్నప్పటి రోజులను గుర్తుచేసుకుంటూ అప్పటి ఫొటోను "unforgettable years" అనే క్యాప్షన్‌తో తన ట్విట్టర్‌లో గతంలో పోస్ట్ చేశారు. ఇలా వేరువేరు సందర్భాల్లో నాన్సీ, హు జిజిన్ పోస్ట్ చేసిన ఫొటోలను ఫొటోషాప్‌లో అతికించి నెటిజన్లలో కొత్త చర్చకు తెరలేపారు. వాళ్లిద్దరూ పెళ్లి చేసుకున్నారనే ప్రచారంలో ఏమాత్రం నిజం లేదని వెల్లడైంది. వయసు రీత్యా చూసుకున్నా పెలోసీ వయసు ప్రస్తుతం 82 సంవత్సరాలు. ఆమె వయసుతో పోల్చుకుంటే హు జిజిన్ 20 ఏళ్లు చిన్నవాడు. వైరల్ అయిన నాన్సీ పెలోసీ ఫొటో 1960వ సంవత్సరం నాటిదని తేలింది. ఆ సమయానికి అమెరికా అధ్యక్షుడిగా పనిచేసిన జాన్ ఎఫ్.కెనెడీ, పెలోసీ వయసు దాదాపుగా ఒకటే. కానీ.. 1960వ సంవత్సరం నాటికి జిజిన్ అప్పుడే పుట్టిన పిల్లాడు కావడం కొసమెరుపు.



అగ్గి రాజేసిన నాన్సీ పెలోసీ పర్యటన

అమెరికా కాంగ్రెస్‌ దిగువ సభ స్పీకర్‌ నాన్సీ పెలోసీ పర్యటన తైవాన్‌లో అగ్గి రాజేసింది. చైనా నుంచి 27 యుద్ధ విమానాలు బుధవారం తైవాన్‌ గగనతల రక్షణ జోన్‌లోకి ప్రవేశించాయి. తైవాన్‌ చూట్టూ ఆరు ప్రాంతాల్లో గురువారం నుంచి నాలుగు రోజుల పాటు విధ్వంసకర సైనిక విన్యాసాలను చేపట్టనున్నట్టు చైనా ప్రకటించింది. దీంతో తమ నౌకాశ్రయాలు, పట్టణ ప్రాంతాలకు ముప్పు పొంచి ఉన్నట్టు తైవాన్‌ ఆందోళన వ్యక్తం చేసింది. అయితే, 2.3 కోట్ల తైవాన్‌ ప్రజలు తల వంచే ప్రసక్తే లేదని ఆ దేశం ప్రకటించింది. మరోవైపు తైవాన్‌ నుంచి చేపలు, సిట్రస్‌ ఫలాలు, తేనె, తేయాకు తదితర కీలకమైన దిగుమతులను చైనా నిషేధించింది. తైవాన్‌కు ఇసుక ఎగుమతిని కూడా చైనా నిలిపివేసింది. ఇదిలా ఉండగా, తైవాన్‌ అధ్యక్షురాలు ట్సాయ్‌ ఇంగ్‌-వెన్‌తో పెలోసీ బుధవారం సమావేశమయ్యారు. చైనా బెదిరింపులకు భయపడి, తైవాన్‌ విషయంలో తమ నిబద్ధతను వీడేది లేదని ఈ సందర్భంగా నాన్సీ స్పష్టం చేశారు. బుధవారం సాయంత్రం పెలోసీ బృందం తైవాన్‌ నుంచి దక్షిణ కొరియాకు పయనమైంది.


మేం తలొగ్గం: తైవాన్‌ 

చైనాకు తాము తలొగ్గేది లేదని తైవాన్‌ అధ్యక్షురాలు ట్సాయ్‌ ఇంగ్‌-వెన్‌ స్పష్టం చేశారు. తైవాన్‌ పౌర పురస్కారం ‘ఆర్డర్‌ ఆఫ్‌ ది ప్రొపీషియస్‌ క్లౌడ్స్‌’తో పెలోసీని సత్కరించారు. కాగా, పెలోసీ పర్యటనపై బీజింగ్‌లోని అమెరికా రాయబారి నికోలస్‌ బర్న్స్‌కు చైనా సమన్లు పంపించింది.

Updated Date - 2022-08-04T22:14:13+05:30 IST