ఉసురుతీసిన వివాహేతర సంబంధం

ABN , First Publish Date - 2021-01-17T06:05:26+05:30 IST

హితులు మృతదేహాల వద్ద కన్నీరుమున్నీరయ్యారు. టెక్కలి ఎస్‌ఐ ఎన్‌.కామేశ్వరరావు సిబ్బంది తో ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాలను పరిశీలించారు. పోస్టుమార్టం నిమిత్తం టెక్కలిలోని జిలా కేంద్రాస్పత్రికి తరలించారు. కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్

ఉసురుతీసిన వివాహేతర సంబంధం
మృతదేహాలను పరిశీలిస్తున్న పోలీసులు




 ఇద్దరి బలవన్మరణం
 పిట్టలసరియాలో విషాదం
 టెక్కలి రూరల్‌, జనవరి 16:
వారిద్దరూ సమీప బంధు వులు. ఇద్దరికీ వివాహాలు జరిగా యి. కానీ వారి మధ్య సాన్నిహిత్యం పెరిగింది. వివాహేతర సంబం ధానికి దారితీసింది. దీంతో తరచూ ఇరు కుటుంబాల మధ్య తగాదాలు చోటుచేసుకుం టున్నాయి. దీంతో మనస్తాపానికి గురైన వారు బలవన్మరణానికి పాల్పడ్డారు. ఈ విషాద ఘటన గూడెం పంచాయతీ పిట్టలసరియాలో శనివారం జరిగింది. ఇందుకు సంబంధించి పోలీసులు అందించిన వి వరాలిలా ఉన్నాయి.   పిట్టలసరియాలో ఇప్పిలి రవి (25), పానిల వేణమ్మ (30) అనే ఇద్దరు వివాహితులు ఆదివారం గ్రామ సమీపంలోని చెట్టుకు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. శుక్రవారం రాత్రి నుంచి వీరు అదృశ్యమయ్యారు. కుటుంబసభ్యులు వెతికినా ఫలితం లేకపోయింది. శనివారం వేకువజామున గ్రామ సమీపంలోని మామిడి చెట్టుకు మృతదేహాలు వేలాడుతూ కనిపించాయి.స్థానికులు గుర్తించి కుటుంబసభ్యులకు సమాచారమందించారు. మృతదేహాల వద్ద వారు కన్నీరుమున్నీరయ్యారు. రవికి చిన్ననాడే తల్లిదండ్రులు మృతిచెందగా..తాత, అమ్మమ్మ మల్లేసు, పాపమ్మల సంరక్షణలో పెరిగాడు. మేనమామ కుమార్తెతో ఏడాదిన్నర కిందట వివాహం జరిగింది. వీరికి రెండు నెలల కిందట కుమారుడు పుట్టాడు. రవికి వరుసకు మేనమామ అయ్యే వ్యక్తితో వేణమ్మకు 13 ఏళ్ల కిందట వివాహం జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. సమీప బంధువులు కావడంతో వేణమ్మతో రవికి సాన్నిహిత్యం ఏర్పడింది. ప్రేమగా మారి వివాహేతర సంబంధానికి దారితీసింది. ఈ నేపథ్యంలో వేణమ్మను వివాహం చేసుకోవడానికి రవి ముందుకొచ్చాడు. పెద్దల వద్ద పంచాయితీ సైతం జరిగింది. కానీ ఇరు కుటుంబాల వారు ఒప్పుకోలేదు. రవిని ఒప్పించి మేనమామ కుమార్తెతో వివాహం జరిపించారు. కానీ రవి, వేణమ్మ మధ్య సాన్నిహిత్యం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో తరచూ గొడవలు చోటుచేసుకుంటున్నాయి. దీంతో మనస్తాపంతో ఇద్దరూ శుక్రవారం రాత్రి ఇంటి నుంచి వెళ్లిపోయారు. ఉదయానికి శవాలుగా కనిపించారు. కుటుంబసభ్యులు, బంధువులు, స్నేహితులు మృతదేహాల వద్ద కన్నీరుమున్నీరయ్యారు. టెక్కలి ఎస్‌ఐ ఎన్‌.కామేశ్వరరావు సిబ్బంది తో ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాలను పరిశీలించారు. పోస్టుమార్టం నిమిత్తం టెక్కలిలోని జిలా కేంద్రాస్పత్రికి తరలించారు. కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ కామేశ్వరరావు తెలిపారు.




Updated Date - 2021-01-17T06:05:26+05:30 IST