చైనా ఉత్పత్తులు వాడొద్దన్నందుకు అమూల్‌ ఖాతాను నిలిపివేసిన ట్విటర్‌

ABN , First Publish Date - 2020-06-07T08:34:12+05:30 IST

అమూల్‌ బ్రాండ్‌ ఉత్పత్తుల యాజమాన్య సంస్థ అయిన గుజరాత్‌ కో-ఆపరేటివ్‌ మిల్క్‌ మార్కెటింగ్‌

చైనా ఉత్పత్తులు వాడొద్దన్నందుకు అమూల్‌ ఖాతాను నిలిపివేసిన ట్విటర్‌

న్యూఢిల్లీ/అహ్మదాబాద్‌, జూన్‌ 6: అమూల్‌ బ్రాండ్‌ ఉత్పత్తుల యాజమాన్య సంస్థ అయిన గుజరాత్‌ కో-ఆపరేటివ్‌ మిల్క్‌ మార్కెటింగ్‌ ఫెడరేషన్‌(జీసీఎంఎంఎఫ్‌) ఖాతాను ట్విటర్‌ నిలిపివేసింది. చైనా ఉత్పత్తులను నిషేధించాలనే అర్థం వచ్చేలా ‘డ్రాగన్‌ నుంచి బయటకు రండి’ అని ఉన్న ప్రకటనను ఈ నెల 4న పోస్ట్‌ చేయడమే దీనికి కారణం. అలాగే, భారత్‌ తయారీ ఉత్పత్తులను ప్రోత్సహించాలని కోరడంతో పాటు అమూల్‌ భారత్‌ తయారీ అని కూడా దానిలో ఉంది. దాంతో ఖాతాను నిలుపుదల చేసిన ట్విటర్‌.. నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేయడంతో తిరిగి 5న పునరుద్ధరించింది. కానీ, రీకాప్చా వంటి ఆంక్షలు విధించింది.  

Updated Date - 2020-06-07T08:34:12+05:30 IST