అమూల్‌ డెయిరీకి పాలు పోయండి

ABN , First Publish Date - 2021-03-05T05:44:05+05:30 IST

రైతులు దళారులను నమ్మి మోసపోవద్దని అమూల్‌ డెయిరీకి పాలు పోయా లని కలెక్టర్‌ మురళీధర్‌రరెడ్డి అన్నారు.

అమూల్‌ డెయిరీకి పాలు పోయండి

 దళారులను నమ్మి మోసపోవద్దు : కలెక్టర్‌ 

కోటనందూరు, మార్చి 4: రైతులు దళారులను నమ్మి మోసపోవద్దని అమూల్‌ డెయిరీకి పాలు పోయా లని కలెక్టర్‌ మురళీధర్‌రరెడ్డి అన్నారు. గురువారం మం డలంలోని బీమవరపుకోటలో సిండికేట్‌ బ్యాంక్‌, కోటనం దూరు స్టేట్‌బ్యాంక్‌ పరిధిలోగల రైతులకు వైఎస్‌అర్‌ చేయూత పథకం కింద లబ్ధిదారులకు పత్రాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ గ్రామా ల్లో ప్రజలకు జీవనోపాధి కల్పించే లక్ష్యంతో అందరికీ రుణాలు అందించేందుకు చర్యలు చేపడుతున్నామన్నా రు. జిల్లాలో రూ.2వేల కోట్లతో రుణాలు ఇస్తున్నామని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని సూచిం చారు. బిళ్లనందూరులో నిర్మిస్తున్న రైతుభరోసా, హెల్త్‌ కమ్యూనిటీ, సచివాలయం భవనం పనులను పరిశీ లించారు. బీమవరపుకోట గ్రామంలో హైస్కూల్‌ పనుల ను పరిశీలించి, మధ్యాహ్నభోజన పథకం తనిఖీ చేశారు. ఇంటింటికీ రేషన్‌ను పరిశీలించారు. అనంతరం రుణ పత్రాలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో జాయింట్‌ కలెక్టర్‌ రాజకుమారి, జిల్లా పశుసంవర్ధకశాఖ జేడీ శ్రీనివాసరావు, ఆర్డీవో మల్లిబాబు, ఎంపీడీవో   సుబ్రహ్మ ణ్యశర్మ, సర్పంచ్‌లు రుత్తల జోగిరాజు, జిగటాల వీరబా బు, గరిసింగి శివలక్ష్మీదొర బాబు, ఏపీఎం సూర్యకుమారి, లగుడు శ్రీనువాస్‌రావు, కె.కృష్ణ, సత్తిబాబు  పాల్గొన్నారు.

నాడు నేడు పనుల పరిశీలన 

తునిరూరల్‌, మార్చి 4: డి.పోలవరం ప్రభుత్వ పాఠశా లలో నాడునేడు పనులను జిల్లా కలెక్టర్‌ మురళీధర్‌ రెడ్డి పరిశీలించారు. రూ.60లక్షల ప్రభుత్వ నిధులతో చేపడు తున్న పనులు పురోగతిపై కలెక్టర్‌ ఆరా తీశారు. నిర్మాణ పనుల్లో నాణ్యతా ప్రమాణాలు లోపిస్తే చర్యలు తప్పవని అధికారులను హెచ్చరించారు. ఆయన వెంట పెద్దాపురం ఆర్‌డీవో  ఎస్‌.మల్లిబాబు, తహశీల్దారు శ్రీపల్లవి, ఎంపీడీవో శ్రీనివాస దొర తదితరులు ఉన్నారు. 

సచివాలయాన్ని పరిశీలించిన జేసీ  

తొండంగి, మార్చి 4: జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ రాజకుమారి గురువారం గోపాలపట్నం సచివాలయాన్ని సందర్శించారు. వైఎస్సార్‌ బీమా, ఆసరా, చేయూత తదితరాలపై సమీక్షించారు. సచివాలయ సిబ్బందిని పలు అంశాలపై అడిగి తెలుసుకున్నారు. కార్యాలయాన్ని పరిశీలించి పలు సూచనలు చేశారు. ఆమె వెంట ఆర్‌.ఐ ప్రసాద్‌ తదితరులు ఉన్నారు. 



Updated Date - 2021-03-05T05:44:05+05:30 IST