నేటి నుంచి ఎంసెట్‌

ABN , First Publish Date - 2021-08-04T05:47:06+05:30 IST

టీఎస్‌ ఎంసెట్‌ పరీక్షను ఈ నెల 4 నుంచి ఉమ్మడి జిల్లా లో నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశా రు.

నేటి నుంచి ఎంసెట్‌
సూర్యాపేట కేంద్రంలోని ఎస్వీ ఇంజనీరింగ్‌ కళాశాలలో ఈసెట్‌ పరీక్షకు వస్తున్న విద్యార్థులను తనిఖీచేస్తున్న అధ్యాపకులు

నల్లగొండ క్రైం, సూర్యాపేట అర్బన్‌, ఆగస్టు 3: టీఎస్‌ ఎంసెట్‌ పరీక్షను ఈ నెల 4 నుంచి ఉమ్మడి జిల్లా లో నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశా రు.   నల్లగొండ జిల్లా కేంద్రంలో ఒకటి, సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఒక పరీక్ష కేంద్రాన్ని ఏర్పాటుచేశారు. నల్లగొండలో ఎస్పీఆర్‌ పాఠశాల, సూర్యాపేటలో ఎస్వీ ఇంజనీరింగ్‌ కళాశాలలో పరీక్ష కేంద్రాలు ఏర్పాటుచేశారు. ఈ నెల 4 నుంచి 10వ తేదీ వరకు పరీక్షలు రోజు రెండు సెషన్లలో నిర్వహించనున్నారు. తొలి మూడు రోజులు ఇంజనీరింగ్‌ విద్యార్థులకు, తరువాత రోజుల్లో మెడికల్‌, అగ్రికల్చర్‌ విద్యార్థులకు పరీక్షలు నిర్వహించనున్నారు. ప్రతీ సెషన్‌కు 150మంది విద్యార్థులు హాజరుకానున్నట్లు ఉమ్మడి జిల్లా రీజనల్‌ కోఆర్డినేటర్‌ డాక్టర్‌ బి.ధర్మనాయక్‌ తెలిపారు. కరోనా నేపథ్యంలో కొవిడ్‌ నిబంధనలు పాటిస్తూ పరీక్షలు నిర్వహిస్తామని ఆయన తెలిపారు.


ప్రశాంతంగా ఈసెట్‌

సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ఎస్వీ ఇంజనీరింగ్‌ కళాశాలలో ఈసెట్‌ మంగళవారం ప్రశాంతంగా ముగిసింది. ఉదయం 159మంది విద్యార్థులకు 145మంది హాజరయ్యారు. మధ్యాహ్నం 160 మంది విద్యార్థులకు, 145 మంది హాజరుకాగా, మొత్తం 29మంది గైర్హాజరయ్యారు.

Updated Date - 2021-08-04T05:47:06+05:30 IST