సమరయోధుల స్ఫూర్తిని చాటిన అమృతోత్సవాలు

ABN , First Publish Date - 2022-08-16T06:47:17+05:30 IST

స్వాతంత్ర్యోద్యమంలో సమరయోధులు స్ఫూర్తిని చాటేలా ఆజాదీ కా అమృతోత్సవాలు నిలిచాయని మాజీ మంత్రి, ఎమ్మె ల్సీ కేఈ ప్రభాకర్‌ అన్నారు.

సమరయోధుల స్ఫూర్తిని చాటిన అమృతోత్సవాలు

కర్నూలు(కల్చరల్‌), ఆగస్టు 15: స్వాతంత్ర్యోద్యమంలో సమరయోధులు స్ఫూర్తిని చాటేలా ఆజాదీ కా అమృతోత్సవాలు నిలిచాయని మాజీ మంత్రి, ఎమ్మె ల్సీ కేఈ ప్రభాకర్‌ అన్నారు. సోమవారం రాత్రి నగరం లోని టీజీవీ కళాక్షేత్రంలో గత మూడు రోజులుగా కొనసాగుతున్న ఆజాదీ కా అమృతోత్సవ సాంస్కృతిక కార్యక్రమాలు ముగిశాయి. ముఖ్య అతిథిగా కేఈ ప్రభాకర్‌, మాట్లాడుతూ మహనీయుల త్యాగ ఫలంతో లభించిన 75 సంవత్సరాల అమృతోత్సవ స్ఫూర్తితో అన్ని రాజకీయ పార్టీలు ముందుకు నడవాలని అన్నారు. టీడీపీ కర్నూలు లోక్‌సభ అధ్యక్షుడు సోమిశెట్టి వెంకటేశ్వర్లు, జనవిజ్ఞాన వేదిక జాతీయ అధ్యక్షుడు డాక్టర్‌ వి.బ్రహ్మారెడ్డి మాట్లాడుతూ దేశవ్యాప్తంగా అమృతోత్సవ సందడి కనిపిస్తోందని, ప్రతి ఒక్కరూ సమాజానికి కొంత సేవచేసే భావన అలవర్చుకోవాలని సూచిం చారు. కార్యక్రమంలో టీజీవీ కళాక్షేత్రం అధ్యక్షుడు పత్తి ఓబులయ్య, కార్యదర్శి మహ్మద్‌ మియా, కోశాధికారి లక్ష్మీకాంతరావు, యాగంటీశ్వరప్ప  పాల్గొన్నారు.

కళాకారులకు సత్కారం.. ఇటీవల తిరుపతిలోని అభినయ ఆర్ట్స్‌ థియేటర్స్‌ వారి జాతీయ నాటక పోటీల్లో ఉత్తమ తృతీయ బహుమతితో పాటూ ఉత్తమ నటుడు, ఉత్తమ నటి, ఉత్తమ సహాయ నటి, ఉత్తమ సంగీత దర్శకుడు అవార్డు లు సాధించిన ఆనంద నిలయం నాటక దర్శకుడు వీవీ రమణారెడ్డి, నటుడు గాం డ్ల లక్ష్మన్న, నటీమణి ఎంఆర్‌ రాధిక, హార్మోనిస్టు పీజీ వెంకటేశ్వర్లులను ఎమ్మెల్సీ కేఈ ప్రభాకర్‌, సోమిశెట్టి వెంకటేశ్వర్లు శాలువ, జ్ఞాపిక, పూలమాలలతో సత్క రించారు.         



Updated Date - 2022-08-16T06:47:17+05:30 IST